Samantha: సమంతతో తీస్తున్న ‘యశోద’ మూవీ అలాంటి కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా డౌట్ పడాల్సిందే..!

Share

Samantha: సమంత ప్రస్తుతం మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు సైన్ చేస్తోంది. కథ నచ్చితే పాత్రకు అవసరమైనంత గ్లామర్‌గా, బోల్డ్‌గా నటించడానికి సిద్దమవుతోంది. ఒకరకంగా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమా చేయడం అంటే అందరికీ దక్కే అవకాశం కాదు. ఇలాంటి సినిమాలను ఎక్కువగా బాలీవుడ్‌లో రూపొందిస్తుంటారు. అక్కడ మార్కెట్ స్థాయి ఎక్కువ కాబట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీద స్టార్ హీరోయిన్స్ ఎక్కువగా దృష్ఠిపెడుతుంటారు. కానీ టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రూపొందిస్తున్నా వాటిలో చాలా తక్కువ శాతమే సక్సెస్ సాధిస్తున్నాయి.

samantha-yashoda concept should be doubted
samantha-yashoda concept should be doubted

అయితే, సమంత ఇప్పుడు కమర్షియల్ సినిమాలకంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో శాకుంతలం సినిమాను పూర్తి చేసింది. అలాగే హాలీవుడ్‌లోనూ లెస్బియన్ సినిమాకు ఒకే చెప్పింది. ఓ తమిళ సినిమా ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. గత దసరా ఓండుగ సందర్భంగా యశోద, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రాలను కమిటయింది. కాగా, ఇటీవలే మొదలైన యశోద సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను చిత్రబృందం కంప్లీట్ చేసింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ వెల్లడించారు.

Samantha: ‘యూ టర్న్’ తరహాలో ‘యశోద’ సాగుతుందని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు నెక్స్ట్ షెడ్యూల్స్‌కు సంబంధించిన డీటేయిల్స్ కూడా వెల్లడించారు. 2022, జనవరి 3వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభిస్తారు. 12వ తేది వరకు ఈ షెడ్యూల్‌ను పూర్తిచేస్తారు. ఆ తర్వాత 3వ షెడ్యూల్ జనవరి 20 నుంచి మొదలుపెట్టి మార్చి 31 వరకు నాన్ స్టాప్‌గా జరుపుతారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరి నుంచి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టనున్నారు. దర్శకులు కొత్తవారు. అయినా సమంత కథ మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకుంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, మధురిమ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా కన్నడలో వచ్చిన యూ టర్న్ తరహాలో సాగుతుందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే యశోద సినిమా హిట్ సాధిస్తుందా అని డౌట్ రాక మానదు. మరి కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజైతే గానీ దీనిపై ఓ క్లారిటీ రాదు.


Share

Related posts

Prabhas: ప్రభాస్ ప్రెస్ మీట్ ల గురించి కరణ్ జోహార్ ఎవరకు తెలియని సరికొత్త కామెంట్స్..!!

sekhar

భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది

Siva Prasad

Kamal Hasan : “మూడు” సీట్లు అయినా తెస్తుందా?

Comrade CHE