Samantha: దక్షిణాది సినిమా రంగంలో అగ్రతారగా కొనసాగిన సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక కెరియర్ పరంగా వరుస అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతూ ఉంది. “పుష్ప”లో ఐటెం సాంగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో “ది ఫ్యామిలీ మెన్ 2” వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకుల అభిమానం సంపాదించడం తెలిసిందే. దీంతో సమంతాకి భారీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. విషయంలోకి వెళ్తే హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా “సిటాడేల్” అనే టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా… ప్రపంచంలోనే పేరు సంపాదించడం జరిగింది.
ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్ నీ బాలీవుడ్ లో.. సమంత ఇంక వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్నారు. “ఫ్యామిలీ మెన్ 2” వెబ్ సిరీస్ దర్శకుల బృందం తెరకెక్కిస్తోంది. ఇటువంటి తరుణంలో సమంత అమెరికా ప్రయాణం పెట్టుకోవడం సంచలనంగా మారింది. సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు అందువల్లే అమెరికాలో చికిత్స కోసం వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో సమంత మేనేజర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో.. సమంత స్కిన్ మీద వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు.
సమంత అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదన్నారు. “సిటాడేల్” ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లో తన పాత్రకి సంబంధించి కటోరమైన .. శిక్షణ కోసం వెళ్తోంది అని క్లారిటీ ఇచ్చారు. అక్కడ ప్రొఫెషనల్ యాక్షన్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో..కఠోరమైన ట్రైనింగ్ తీసుకోనుంది.. అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటె “సిటాడేల్” ఇండియన్ వెర్షన్ ప్రధాన పాత్ర కోసం సమంత భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. “సిటాడేల్” హాలీవుడ్ వర్షన్ లో ప్రియాంక చోప్రా భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఇప్పుడు ఇదే దిశగా ఇండియన్ వెర్షన్ “సిటాడేల్”కి సంబంధించి.. పూర్తి ఫిట్నెస్ కోసం సమంతా అమెరికాలో నిపుణులతో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.