సినిమా

pawan kalyan: ప‌వ‌న్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న మ‌హేష్‌ విల‌న్‌.. ఇదిగో క్లారిటీ!

Share

pawan kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత రీమేక్ చిత్రాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న నుంచి చివ‌రిగా వ‌చ్చిన వ‌కీల్ సాడ్‌, భీమ్లా నాయ‌క్ చిత్రాలు రెండూ రీమేక్‌లే కాగా.. మ‌రిన్ని రీమేక్ సినిమాల‌ను ప‌వ‌న్ లైన్‌లో పెట్టాడు. అందులో `వినోదాయ సితం`. తమిళంలో క్రితం ఏడాది అక్టోబర్‌లో విడుద‌లైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆక‌ట్టుకుంది.

ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించడమే కాకుండా.. ఆయన ప్రధానమైన పాత్రను పోషించాడు. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో రీమేక్ కాబోతోంది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఒరిజినల్ ను తెర‌కెక్కించిన స‌ముద్ర‌ఖ‌నినే రీమేక్ కూడా రూపొందించ‌బోతున్నార‌ట‌.

ఇదంతా గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చార‌మే కాగా.. దీనిపై తాజాగా స‌ముద్ర‌ఖ‌ని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `స‌ర్కారు వారి పాట‌`లో మ‌హేష్ బాబుకు విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని న‌టించిన విష‌యం తెలిసిందే. నిన్న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. స‌ముద్ర‌ఖ‌ని న‌ట‌న‌కు సైతం విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ఈ సినిమా ప్ర‌చార కార్యక్ర‌మాల్లో భాగంగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న స‌ముద్ర‌ఖ‌ని.. ప‌వ‌న్ సినిమా గురించి స్పందించారు.

`ప్ర‌స్తుతం వినోదాయ సితం రీమేక్ ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానినే. ప‌క్కా ఫ్యాన్‌లా ఆ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాను.` అంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్ సినిమా క‌న్ఫార్మ్ అయిపోయింది. కాగా.. తెలుగు, త‌మిళ చిత్రాల్లో విల‌న్ మ‌రియు స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతున్న స‌ముద్ర‌ఖ‌ని.. మంచి న‌టుడే కాదు ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌, సింగ‌ర్ కూడా. ఈయ‌న తెలుగులో శంభో శివ శంభో, జెండా పై కపిరాజు వంటి చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు. ఆ త‌ర్వాతే న‌టుడిగా మారారు.


Share

Related posts

SVP: “సర్కారు వారి పాట”లో హైలెట్ అదే.. దానికోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వస్తారంటున్న మహేష్..!!

sekhar

Sarkaru Vaari Paata: `స‌ర్కారు వారి పాట‌`కు ర‌న్ టైమ్ లాక్‌.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!?

kavya N

Heroines: అవకాశాలు వచ్చే వరకు టాలీవుడ్..క్రేజ్ వచ్చాక బాలీవుడ్..స్టార్ హీరోయిన్స్ తీరేంటి ఇంత దారుణం

GRK