Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ..ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో సంచలన దర్శకుడిగా మారాడు. అదే అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ దేవరకొండకు రౌడీ హీరో అనే ఇమేజ్ వచ్చేసింది. ఇక ఇదే అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా తీసి అక్కడ కూడా హాట్ టాపిక్ అయ్యాడు సందీప్ రెడ్డి. అయితే, తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వెంటనే సినిమా అవకాశం రాలేదు. స్టార్ హీరోలందరి వద్దకు వెళ్ళి స్టోరీ చెప్పాడు. కానీ, ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో బాలీవుడ్‌లో సినిమా తీశాడు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక అక్కడ మరో సినిమా మొదలుపెట్టేందుకు చాలానే సమయం పట్టింది. తాజాగా యానిమల్ అనే పేరుతో సినిమాను పట్టాలెక్కించాడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వాస్తవంగా ఈ ‘యానిమల్’ చిత్రాన్ని గతేడాదే సెట్స్ మీదకు తీసుకు రావాల్సింది. కానీ, రణబీర్ వేరే సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు సెట్స్ మీదకు చిత్రాన్ని తీసుకువచ్చారు. హిమాలయాల్లోని మనాలిలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో వెల్లడించింది.
Sandeep Reddy Vanga: ప్రభాస్ – సందీప్ రెడ్డిల స్పిరిట్ పట్టాలెక్కదనిపిస్తోంది..!
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మార్క్ స్టైల్లోనే టైటిల్ కు తగ్గట్టుగా ఈ యానిమల్ సినిమా లో హీరో పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందట. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఇందులో రణబీర్ కపూర్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్స్ బాబీ డియోల్, అనీల్ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. కాగా, ఈ సినిమాను గుల్షన్ కుమార్ సమర్పణలో టీ సిరీస్ – భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమా మొదలు పెట్టడానికే సందీప్ రెడ్డి చాలా సమయం తీసుకున్నాడు. అందుకే, ఇప్పుడు ప్రభాస్‌తో ప్రకటించిన స్పిరిట్ సినిమా పరిస్థితి ఏంటీ అని మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది గానీ ప్రభాస్ – సందీప్ రెడ్డిల స్పిరిట్ పట్టాలెక్కదనిపిస్తోంది.