NewsOrbit
Entertainment News సినిమా

కచ్చితంగా మహేష్ తో సినిమా ఉంటుంది అతి పెద్ద డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..!!

Share

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ డ్రీమ్. మహేష్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ సినిమా హిట్ అయింది అంటే.. కలెక్షన్ లు ఎవరు ఆపలేరు. అటువంటి మహేష్ బాబుతో తెలుగు దర్శకులు మాత్రమే కాదు తమిళ దర్శకులు కూడా అనేక సినిమాలు చేశారు. తాజాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతిపెద్ద డైరెక్టర్ గా రెండు సినిమాలతోనే పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ.. లేటెస్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి సినిమా తీసి ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డికి పేరు వచ్చింది.

sandeep reddy vanga confirmed to do movie with mahesh babu

ఈ క్రమంలో రెండో సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే “అర్జున్ రెడ్డి” ని “కబీర్ సింగ్” గా తెరకెక్కించి అక్కడ కూడా మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వరుసపరాజయాలలో ఉన్న షాహిద్ కపూర్ కి ఈ సినిమా కం బ్యాక్ మూవీగా నిలిచింది. కాగా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో “యానిమల్” అనే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన పాన్ ఇండియా సినిమా సందీప్ రెడ్డి వంగా చేస్తున్నారు. ప్రస్తుతం మీ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా త్వరలో ఆయనతో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు మహేష్ బాబుని వెండి తెరపై 25% మాత్రమే అందరూ చూశారు. ఆయన నటనలో ఇంకా 75% డిఫరెంట్ కోణాలు ఉన్నాయి. ఆయన హావభావాలు అంతా చాలా వ్యత్యాసంగా ఉంటాయి. చాలా గొప్ప నటుడు.

sandeep reddy vanga confirmed to do movie with mahesh babu

నా పరంగా ఇంకా ఆయనలో కొత్త కోణాలను చూపించవచ్చు. కచ్చితంగా రాబోయే రోజుల్లో మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే “అర్జున్ రెడ్డి” విడుదలైన తర్వాత మహేష్ నీ సందీప్ రెడ్డి వంగ అప్పట్లో డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత సందీప్ బాలీవుడ్ కి వెళ్లిపోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా త్వరలో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు సందీప్ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు…త్రివిక్రమ్ అదేవిధంగా రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు తర్వాత సందీప్ దర్శకత్వం చేసే అవకాశం ఉన్నట్లు సమచారం.


Share

Related posts

వర్మ సినిమాకి 100 రూపాయలు కూడా దండగేనా ..?

GRK

Priyanka Mohan Latest Photos

Gallery Desk

Anil Ravipudi: అనిల్ రావిపూడి కి కరోనా నెగిటివ్

bharani jella