Prabhas: “అర్జున్ రెడ్డి” అనే మొదటి సినిమాతోనే సందీప్ రెడ్డి వంగ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయాడు. యూత్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇదే సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో “కభీర్ సింగ్” గా రీమిక్ చేసి అదిరిపోయే హిట్ అందుకోవటం జరిగింది. ప్రస్తుతం రణబీర్ సింగ్ తో “యానిమల్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాల స్పీడ్ గా జరుగుతోంది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా ఓకే చేయటం తెలిసిందే. ఈ సినిమాకి “స్పిరిట్” అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో చేయబోయే సినిమాకి సంబంధించి… సందీప్ రెడ్డి వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం రణభీర్ కపూర్ తో చేస్తున్న “యానిమల్” సినిమా తర్వాత “స్పిరిట్” చేయబోతున్నట్టు తెలిపారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అని పేర్కొన్నారు. మామూలుగానే ప్రభాస్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. స్పిరిట్ విషయంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా… ఉంటుంది అని తెలియజేశారు. కాగా ఈ సినిమాలో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే అనే సినిమాలు చేస్తున్నారు. ఈ రెండిటిలో “సలార్” సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రాజెక్టుకే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒకపక్క మారుతీ తో చేయబోయే సినిమాతో పాటుగా సందీప్ రెడ్డి వంగ “స్పిరిట్” ప్రభాస్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇక ఈ ఏడాది జూన్ నెలలో “ఆదిపురుష్” రిలీజ్ కానుంది. దాదాపు రెండు సినిమాలతో ఈ ఏడాది అభిమానులను ప్రభాస్ అలరించనున్నాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!