NewsOrbit
Entertainment News సినిమా

Spirit: సందీప్ వంగ – ప్రభాస్ ల సినిమా స్పిరిట్ స్టోరీ మొత్తం వచ్చేసింది – మిస్ అవ్వకండి !

Advertisements
Share

Spirit: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “సలార్”, “ప్రాజెక్ట్ కే” సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు కంప్లీట్ అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగ “యానిమల్” అనే సినిమా చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే అదే టైంలో “యానిమల్” సినిమా కూడా కంప్లీట్ కానుందట.

Advertisements

Sandeep Vanga and Prabhas's film Spirit Story leaked in social media

దీంతో పక్కా షెడ్యూల్ తో… స్పిరిట్ సినిమా స్టార్ట్ చేయబోతున్నారట. ఇది కంప్లీట్ యాక్షన్ త్రిల్లర్ అని ఇప్పటికే రివీల్ చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అర్జున్ రెడ్డి మాదిరిగా యువతకి ఒక డ్రగ్ మాదిరిగా మత్తెక్కించే కంటెంట్ కలిగినదట. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయని జోనర్ లో సినిమాని సందీప్ రెడ్డి వంగ తీయబోతున్నారట. ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మాస్ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు.. భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తూ ఉండటంతో అదే తరహాలో ఈ సినిమాలో హీరో పాత్ర ఉండబోతుందట.

Advertisements

Sandeep Vanga and Prabhas's film Spirit Story leaked in social media

ప్రభాస్ డ్రగ్స్ కి బానిస అయినట్లు చూపించబోతున్నారట. ఈ రకంగా ఉండే ప్రభాస్ చివరకు పోలీస్ ఆఫీసర్ గా మారి.. ముంబైలోనే రౌడీలను అంతం చేసే.. రీతిలో స్పిరిట్ స్టోరీని సందీప్ రెడ్డి వంగ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో “అర్జున్ రెడ్డి”, హిందీలో “కబీర్ సింగ్” సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని.. సందీప్ రెడ్డి వంగ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మరోపక్క పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ కలిగిన ప్రభాస్ తో సినిమా చేస్తూ ఉండటంతో స్పిరిట్ అనే సినిమాపై బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి.


Share
Advertisements

Related posts

KGF 2: ఫ‌స్ట్ డే కుమ్మేసిన `కేజీఎఫ్ 2`.. టోట‌ల్ క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా?

kavya N

Anu Kreethy Vas New Wallpapers

Gallery Desk

పవర్ స్టార్ ని ఫాలో అవుతున్న మెగా మేనల్లుడు .. ఇద్దరి మధ్య పోటీ అంటున్నారు ..?

GRK