Pushpa: డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) నటించిన “పుష్ప”(Pushpa) సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య(Aarya), ఆర్య 2 సినిమాలు ఒక ఎత్తు అయితే పుష్ప ఆ రెండు సినిమాలకు భిన్నంగా పెరగడం జరిగింది. సుకుమార్ తో చేసిన మొదటి రెండు సినిమాలలో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. కానీ “పుష్ప”లో ఊర మాస్ తరహాలో… బన్నీ(Bunny) క్యారెక్టర్ ఉంది. గంధపు చెక్కల స్మగ్లర్ గా లారీ డ్రైవర్ పాత్రలో చిత్తూరు(Chitoor) యాసలో మాట్లాడే యువకుడిగా అల్లు అర్జున్ పుష్ప రాజు పాత్రలో చేసిన యాక్టింగ్ చాలా మందిని ఆకట్టుకుంది.
పాత్రలో ఇమిడిపోయాడు అని అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ప్యార్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… పుష్ప సక్సెస్ సంబరాలు అంబరాన్ని తాకేలా సినిమా యూనిట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇటీవల అర్జున్ రెడ్డి(Arjun Reddy) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో సుకుమార్ చిత్రీకరించిన ఓ రొమాంటిక్ సీన్ తనకు బాగా నచ్చిందని మనసులో విషయాన్ని బయట పెట్టాడు. అదేమిటంటే వ్యాన్ లో రష్మిక(Rashmika) భుజంపై చేయి వేసి అల్లు అర్జున్ చేసే రొమాంటిక్ సీన్.
ఈ సీన్స్ సుకుమార్ తీశాడా లేకపోతే వేరే వాళ్ళు తీశారా అన్న తరహాలో థియేటర్ లో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత పచ్చిగా రొమాన్స్ సీన్ ఎలా పెట్టాడ్రా బాబూ అని కూడా చాలామంది అనుకున్నారు. తర్వాత సన్నివేశంలో కి వెళ్తే రష్మిక చెయ్ తీయమనడం.. తాను అలిగి తీసేయడం.. అలిగాడని.. రష్మిక మళ్లీ చేయి భుజంపై వేసుకోవడం.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా రొమాంటిక్ గా అనిపించిందని సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)… చాలా అద్భుతంగా సుకుమార్ టేకప్ చేశాడని పుష్పలో… ఈ సన్నివేశం తనకు బాగా నచ్చినట్లు సందీప్ రెడ్డి వంగ ఇటీవల తెలిపాడు. ఈ సన్నివేశం చూసి థియేటర్లో ప్రేక్షకులు మాత్రం యువత నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.