సంజ‌య్‌ద‌త్‌కు కోర్టు నోటీసులు

Share


బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సంజ‌య్ ద‌త్‌కు కోర్టు నోటీసులు వ‌చ్చాయి. అందుకు కార‌ణం.. ఆయ‌న కొత్త సినిమా `ప్ర‌స్థానం`. ఇంత‌కు ప్ర‌స్థానానికి, కోర్టు సంబంధం ఏంటి? అని అనుకుంటున్నారా? అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. తెలుగులో దేవాక‌ట్టా తెర‌కెక్కించిన చిత్రం `ప్ర‌స్థానం`. ఈ సినిమాను సంజ‌య్‌ద‌త్ బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు. ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అయితే షీ మార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమా హ‌క్కులు త‌మ‌వేనంటూ సంజూ బాబాకు కోర్టు నోటీసులు పంపింది. సినిమా ప్రారంభ ద‌శ‌లోనే సద‌రు నిర్మాణ సంస్థ సంజ‌య్‌ద‌త్‌ను క‌లిసింద‌ట‌. అయితే సంజ‌య్ అవేమీ ప‌ట్టించుకోకుండా సినిమాను పూర్తి కానిచ్చేస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించ‌డంతో షీమార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ సంజూ బాబాకి నోటీసులు ఇచ్చింది.


Share

Related posts

బ్రేకింగ్ : మొదలైన కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్..!  మరి విడుదల ఎప్పుడంటే…

arun kanna

మెగా హీరోతో త్రివిక్రమ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్..??

sekhar

మహేష్ కోసం భారీ ప్లాన్ వేస్తున్న సుకుమార్

Siva Prasad

Leave a Comment