సినిమా

sanjay dutt: అమ్మాయిల కోస‌మే డ్ర‌గ్స్ తీసుకున్నా.. `కేజీఎఫ్‌` విల‌న్ షాకింగ్ కామెంట్స్‌!

Share

sanjay dutt: 2018లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన `కేజీఎఫ్ చాప్ట‌ర్‌` దేశవ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `కేజీఎఫ్ 2` వ‌చ్చేసింది. క‌న్నడ రాక్‌స్టార్ య‌శ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ చిత్రంలో భ‌యంక‌ర‌మైన విల‌న్ అధీరగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అద‌ర‌గొట్టేశాడు. అయితే కేజీఎఫ్ 2 మంచి విజ‌యం సాధించ‌డంతో.. సంజ‌య్ ద‌త్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌నూ షేర్ చేసుకున్నారు.

అలాగే తనకు డ్రగ్స్‌ ఎలా అలవాటు అయ్యింది అనే విషయంపై సైతం ఆయ‌న స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సంజ‌య్ ద‌త్ మాట్లాడుతూ.. `అప్పట్లో నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గుగా ఉండేది. అయితే వాళ్లని ఇంప్ర‌స్ చేసేందుకు ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే డ్రగ్స్‌ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం సుల‌భంగా లభిస్తుందని భావించాను.

అలా డ్రగ్స్‌ తీసుకోవడం ప్రారంభించాను. కానీ, ఆ త‌ర్వాత వాటిని బ‌య‌ట ప‌డేందుకు ఎంతో కష్ట‌ప‌డ్డాను. ప‌దేళ్ల పాటు న‌ర‌కం అనుభ‌వించా. రిహబిలిటేషన్ సెంటర్‌లోనూ కొంత కాలం గ‌డిపా. ఇక‌ డ్రగ్స్ బారి నుంచి ఎలాగోలా బ‌య‌ట‌ప‌డ్డాక.. అంద‌రూ నన్ను డ్రగ్గీ అంటూ ర‌క‌ర‌కాల మాట‌లతో విమ‌ర్శించేవారు. దాంతో ఆ మచ్చని పోగొట్టుకోవడానికి కష్టపడి బాడీని బిల్డ్‌ చేసుకున్నా. అప్పటి నుంచే అందరూ నన్ను పొడ‌టం స్టార్ట్ చేశారు.` అంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడీయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


Share

Related posts

Raja Sekhar : రాజశేఖర్ నీ డైరెక్ట్ చేయబోతున్న సెన్సేషనల్ లేడీ డైరెక్టర్..!!

sekhar

F 3: ఈ ఒక్క సాంగ్ చాలు మాస్ ఆడియన్స్ ఊగిపోవడానికి..

GRK

బ్రేకింగ్: అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవానికి ఎంపికైన నాని ‘జెర్సీ’

Vihari
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar