చివరికి మిగిలేది ఎవరో…

సంక్రాంతి పండగ వస్తుంది అంటే చాలు సినీ అభిమానులకి కొత్త ఉత్సాహం వస్తుంది, ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతి పండక్కి పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఈ లిస్ట్ లో ముందుగా ఆడియన్స్ ని పలకరించబోతున్న సినిమా ‘ఎన్టీఆర్’, వెండితెర ఇలవెల్పుగా వెలిగిన నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రాబోతున్న ఈ సినిమాని బాలకృష్ణ నటిస్తు, నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ల్ పార్ట్ కథానాయకుడు సినిమాతో బాలయ్య సంక్రాంతి బరిలో దిగుతున్నాడు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇకఎన్టీఆర్‌ బయోపిక్‌ కావడం ఒక ఎత్తయితే, ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తుండడం మరొక ఎత్తు.. జనవరి 9న వరల్డ్ వైడ్‌గా రాబోతున్న ఈ మొదటి పార్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి తను సంక్రాంతి హీరో అని నిరూపించుకోవాలని బాలయ్య చూస్తున్నాడు.

ఎన్టీఆర్ కథానాయకుడు హడావుడి తగ్గకముందే ప్రేక్షకుల ముందుకి వస్తున్న మరో సినిమా పేట. పరిచయం అక్కర్లేని, ప్రమోషన్స్ అవసరంలేని సినిమా ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా పెటానే. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న పేట ప్రేక్షకుల ముందుకి డబ్బింగ్ సినిమాగానే వస్తున్నా కూడా స్ట్రెయిట్ మూవీస్ కే షాక్ ఇవ్వగల సత్తా ఉన్న సినిమా ఇది. కొంత వరకూ థియేటర్ల కొరత ఉన్నా కూడా రిసెంట్‌గా, రిలీజ్ అయిన ట్రైలర్‌కు కూడా అదిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై ఎక్స్ పెటేషన్స్ హై రేంజ్‌లో ఉన్నాయి. మరి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు రిచ్ అవుతుందో చూడాలి.

మొదటి రెండు సినిమాలు ఒకెత్తు అయితే, జనవరి 11న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న వినయ విధేయ రామ సినిమా మరో ఎత్తు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామా సినిమాతో మిగిలిన చిత్రాలకి గట్టి పోటి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మాస్ దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. మూవీ టైటిల్ సాఫ్ట్‌గా ఉన్న హీరోయిజం మాత్రం మాస్ ఆడియన్స్ మత్తేక్కించేలా ఉంటుంది, ఆ సెంటర్స్ విజిల్స్ తో హోరెత్తుతాయని సినీ అభిమానులుఅనుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ నుంచి ఏం కోరుకుంటున్నారో వినయ విధేయ రామ సినిమాలో బోయపాటి అదే కాస్త డోస్ పెంచి చూపించబోతున్నాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న ఈ మూవీపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

చరణ్ తో పాటు సంక్రాంతి రేస్ లో నిలిచిన మరో మెగా హీరో వరుణ్ తేజ్… సీనియర్ హీరో వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కంట్లీట్ ఫ్యామిలి ఎంటర్ టైనర్‌ సంక్రాంతి అల్లుళ్లు అనే ట్యాగ్‌లైన్‌తో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి రాబోతోంది. జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది. దీంతో ఈ సంక్రాంతి అల్లుళ్లు బాక్సాఫీస్ పోరులో నెగ్గోచ్చనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.

ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఈ నాలుగు సినిమాలు పాజిటివ్ టాక్ తోనే ఉన్నాయి, ఎవరికి వారు తమ సినిమా హిట్ అవుతుందనే ధీమాతో ఉన్నారు. అయితే థియేటర్స్ ప్రాబ్లెమ్ బాగా ఉంది కాబట్టి అన్ని సినిమాలకి ఓపెనింగ్స్ బాగా తగ్గే అవకాశం ఉంది. స్టార్టింగ్ లో కలెక్షన్ల విషయంలో కొంచెం తడబడినా కూడా లాంగ్ రన్ లో నిలబడగల సత్తా ఉంటే చాలు వసూళ్ల వర్షం కురవడం ఖాయం. మరి ఈ సినిమా పోరులో గెలిచి నిలిచేదెవరో చూడాలి.