పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వెండితెరపై “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మెగాభిమానులు ఫుల్ జోష్ నెలకొంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతుంది.
మరోపక్క ఇదే టైమ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “రాధేశ్యామ్” సినిమా కు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ కానుంది. దీంతో సంక్రాంతి పండుగకు ఈ టాప్ హీరోల సినిమాల టీజర్లు ఒకేసారి రిలీజ్ కానున్న నేపథ్యంలో పోటీ నెలకొంది. ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా లో రికార్డులు సృష్ చేస్తామంటూ ఒకరితో మరొకరు చాలెంజ్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న “రాధేశ్యామ్” సినిమా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఐదు భాషల్లో టీజర్ రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ బట్టి “రాధేశ్యామ్” కచ్చితంగా సోషల్ మీడియాలో తిరుగులేని రికార్డు సృష్టించడం గ్యారెంటీ అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఇక పవన్ నటించిన వకీల్ సాబ్ తెలుగు భాషకే పరిమితం కావడంతో “వకీల్ సాబ్” తో “రాధేశ్యామ్” పోటాపోటీ నువ్వా నేనా అన్నట్టు గా ఉంటుందని, అది ఒక తెలుగులో మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా ఈ సంక్రాంతి పండుగకు పవన్ “వకీల్ సాబ్” ప్రభాస్ “రాధేశ్యామ్” టీజర్ ల మధ్య పోటీ గట్టిగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.