NewsOrbit
Entertainment News సినిమా

Mega 154: సంక్రాంతి మరో సినిమా విడుదల చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి అధికారిక ప్రకటన..!!

Mega 154: కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య దాదాపు కరోనా కారణంగా రెండు సంవత్సరాల కంటే ఎక్కువగానే టైం తీసుకుని తెరకెక్కించి విడుదల చేస్తే అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. దీంతో తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసి తరహాలో మెగాస్టార్ చిరంజీవి డిసైడ్ అయినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రీతిలో మెగాస్టార్ చిరంజీవి చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నట్టు టాక్. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమా చేస్తున్నారు. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో నయనతార చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ తుది దశకు చేరుకుంది. చిరంజీవితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Sankranti is the official announcement of megastar Chiranjeevi who is releasing another movie

ఇదిలా ఉంటే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే వచ్చే సంక్రాంతి పండుగకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. 2023 జనవరి సంక్రాంతికి కలుద్దాం.. అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మాత్రమే కాదు ప్రస్తుతం “గాడ్ ఫాదర్” తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో “బోలా శంకర్” సినిమా షూటింగ్ కూడా చిరంజీవి చేస్తూ ఉన్నారు. వరుస పెట్టి రెండు సినిమా షూటింగ్ లలో చిరంజీవి పాల్గొంటున్నారు.

ఇందులో “గాడ్ ఫాదర్” దసరా పండుగకు రిలీజ్ కానున్నట్లు సమాచారం. “బోలా శంకర్” ఈ ఏడాది చివరిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఇదిలా ఉంటే బాబీ దర్శకత్వంలో నటించబోయే సినిమా సంక్రాంతికి విడుదల చేస్తారని తాజాగా ప్రకటన చేయగానే సినిమా టైటిల్ కి సంబంధించి “వాల్తేరు వీరయ్య” అని అంటున్నారు. “ముఠామేస్త్రి” తరహాలో చిరంజీవి ఈ సినిమాలో ఉరా మాస్ పాత్ర చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri