`సరిలేరు నీకెవ్వ‌రు` టీజ‌ర్ డేట్‌


మ‌హేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. అనీల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో విజ‌యశాంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. త‌మ‌న్నా ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తుంది. 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. రామోజీ ఫిలిమ్ సిటీలో కొండారెడ్డి బురుజు సెట్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నార‌ని టాక్‌. సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.