SVP: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైట్స్ కంపోజ్ చేయటంలో టాప్ టెక్నీషియన్స్ గా పేరు సంపాదించిన వారు రామ్ లక్ష్మణ్ బ్రదర్స్. ఈ అన్నదమ్ములు ఆధ్వర్యంలో వుడ్ ఇండస్ట్రీ లో బాక్సాఫీస్ రికార్డు సృష్టించిన సినిమాలలో చాలా వరకు యాక్షన్ సన్నివేశాలు చాలా హైలెట్ గా చిత్రీకరించటం జరిగింది. పవన్ కళ్యాణ్…” గబ్బర్ సింగ్” ఇంకా చాలా మెగాహీరోలు మరియు ఇంక టాప్ హీరోల సినిమాలలో అద్భుతమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం లో రామ్- లక్ష్మణ్ స్టైలే వేరు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అట. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహేష్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందని… ఎంటర్టైన్మెంట్ పరంగా దూకుడు తరహా ఫ్లవర్ సినిమాలో కనిపిస్తుందని ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ ఫైట్ సీన్ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ ప్లాన్ చేయడం జరిగిందట.
Read More: Mahesh Babu: మహేష్ “సర్కారు వారి పాట” కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ..??
దుబాయ్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరగనుంది అట. ఈ ఫైట్ సీన్ లో మహేష్ బాబు తో ప్రొఫెషనల్ ఫైటర్స్ తలపడనున్నారు అట. ప్రత్యేకంగా ఈ ఫైట్ సన్నివేశం కోసం రామ్ లక్ష్మణ్ తన టీం మెంబర్స్ మొత్తాన్ని మార్చి సరికొత్త వారిని రంగంలోకి దింపి… ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాలో లేని ఫైట్ కంపోజింగ్.. ఈ సినిమాలో చేయడానికి రెడీ అయ్యారట. ఖచ్చితంగా ఫిలింనగర్లో లేటెస్ట్ టాక్ గట్టిగా వినబడుతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!