Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. సముద్రఖని విలన్‌గా చేశారు. నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిన్న వరల్డ్ వైడ్‌గా విడుదల అయింది. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఓ మంచి సందేశాత్మక పాయింట్‌ని ఎంచుకుని, దానికి కమర్షియల్ హంగులను జతపర్చి ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్న పరశురామ్ బాగానే సక్సెస్ అయ్యాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
లవ్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ తో కథను బోర్ కొట్టించకుండా కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది. `మహి ఫైనాన్స్ కార్పోరేషన్` పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే వ్యక్తిగా మహేశ్ నటిస్తే.. కాసినోలో పేకాట ఆడుతూ లైఫ్ ను ఎంజాయ్ చేసే కళావతిగా కీర్తి అలరించింది. మొత్తానికి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. ఫస్డ్ డే మహేష్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేశాడు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 36.01 కోట్ల రేంజ్లో షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 45.21 కోట్లు షేర్‌ను కొల్లగొట్టింది. ఇక ఏరియాల వారీగా సర్కారు వారి పాట ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం: 12.24 కోట్లు
సీడెడ్: 4.70 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.74 కోట్లు
తూర్పు: 3.25 కోట్లు
పశ్చిమ: 2.74 కోట్లు
గుంటూరు: 5.83 కోట్లు
కృష్ణ: 1.95 కోట్లు
నెల్లూరు: 1.56 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ= 36.01 కోట్లు(50.10 కోట్లు~ గ్రాస్)
———————-
రెస్ట్ ఆఫ్ ఇండియా+కర్ణాటక: 2.70 కోట్లు
ఓవర్సీస్- 6.50 కోట్లు
————————
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్: 45.21కోట్లు(70కోట్లు~ గ్రాస్)
————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్కారు వారి పాట.. రూ. 121 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 75.79 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.