Sarkaru Vaari Paata: `గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన చిత్రమే `సర్కారు వారి పాట`. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేస్ జంటగా నటించగా.. దర్శకనటుడు సముద్రఖని విలన్‌గా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందించాడు.
మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే 12న విడుదలైంది. అయితే తొలి రోజు నెగటివ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం సర్కారు వారి పాటపై సూపర్ హిట్ అనే పాజిటివ్ పబ్లిసిటీ వైరల్ అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 36.01 కోట్ల షేర్, రెండో రోజు రూ. 11.04 కోట్ల షేర్, మూడో రోజు రూ. 12.01 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. నాలుగు రోజు 12.06 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక ఏరియాల వారీగా సర్కారు వారి పాట నాలుగు రోజుల టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 27.55 కోట్లు
సీడెడ్: 8.82 కోట్లు
ఉత్తరాంధ్ర: 9.37 కోట్లు
తూర్పు: 6.49 కోట్లు
పశ్చిమ: 4.15 కోట్లు
గుంటూరు: 7.51 కోట్లు
కృష్ణ: 4.52 కోట్లు
నెల్లూరు: 2.71 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ= 71.12 కోట్లు(102.60 కోట్లు~ గ్రాస్)
———————-
రెస్ట్ ఆఫ్ ఇండియా+కర్ణాటక: 4.60 కోట్లు
ఓవర్సీస్- 10.15 కోట్లు
————————
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్: 85.87 కోట్లు(133.80 కోట్లు~ గ్రాస్)
————————
కాగా, వరల్డ్ వైడ్‌గా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్కారు వారి పాట.. రూ. 121 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే మొదటి నాలుగు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 35.13 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న జోరే కొనసాగితే లాంగ్ రన్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకుని క్లీన్ హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.