SVP: `గీత గోవిందం`తో మంచి ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పరశురామ్‌తో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన చిత్రం `సర్కారు వారి పాట`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా.. సముద్ర ఖని విలన్‌గా చేశారు. మే 12న విడుదలైన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ తొలి రోజు మిశ్రమ స్పందన దక్కించుకున్నా.. ఆ తర్వాత గుడ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అయితే వీకెండ్ లో దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మహేశ్.. వర్కింగ్ డేస్ లో మాత్రం వీక్ అయిపోయాడు.
సోమవారం కంటే మంగళవారం కలెక్షన్స్ అనుకున్న దాని కంటే ఎక్కువ డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 36.01 కోట్లు, రెండో రోజు రూ. 11.04 కోట్లు, మూడో రోజు రూ. 12.01 కోట్లు, నాల్గొవ రోజు రూ. 12.06 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఐదో రోజు రూ. 3.64 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది. ఇక 6వ రోజు విషయానికి వస్తే వసూళ్లు మరింత తగ్గాయి. రూ. 2.32 కోట్ల షేర్‌ను మాత్రమే ఈ మూవీ రాబట్టగలిగింది. ఏరియాల వారీగా సర్కారు వారి పాట ఆరు రోజుల టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 29.43 కోట్లు
సీడెడ్: 9.64 కోట్లు
ఉత్తరాంధ్ర: 10.40 కోట్లు
తూర్పు: 7.17 కోట్లు
పశ్చిమ: 4.59 కోట్లు
గుంటూరు: 7.89 కోట్లు
కృష్ణ: 4.97 కోట్లు
నెల్లూరు: 2.99 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ= 77.08 కోట్లు(112.60 కోట్లు~ గ్రాస్)
———————-
రెస్ట్ ఆఫ్ ఇండియా+కర్ణాటక: 5.60 కోట్లు
ఓవర్సీస్- 11.34 కోట్లు
————————
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 94.02 కోట్లు(148.00 కోట్లు~ గ్రాస్)
————————
కాగా, వరల్డ్ వైడ్‌గా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్కారు వారి పాట.. రూ. 121 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిలవాలంటే మొదటి ఆరు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 26.98 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. మరి మహేశ్ అంత భారీ టార్గెట్‌ను రీచ్ అవుతాడా.. లేదా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…