సినిమా

Sarkaru Vaari Paata: భారీగా స‌ర్కారు వారి బిజినెస్‌.. హిట్ అవ్వాలంటే గ‌ట్టిగానే కొట్టాలి!

Share

Sarkaru Vaari Paata: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా చేశారు. వెన్నెల కిశోర్‌, న‌దియా, తనికెళ్ల భరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప‌క్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, గ్లింప్స్‌, సాంగ్స్ సినిమాపై మంచి అంచ‌నాలు పెంచగా.. మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మ‌రింత బ‌జ్ క్రియేట్ అయ్యేలా చేశారు. దీంతో ఈ మూవీ భారీగానే బిజినెస్ చేసి బ‌రిలోకి దూకుతోంది.

స‌ర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 120 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసి అద‌ర‌గొట్టేసింది. ఇక ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే రూ. 121 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా మ‌హేశ్ మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకోవాలంటే ఈ సారి గ‌ట్టిగానే కొట్టాలి. ఇక ఏరియాల వారీగా స‌ర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి.

నైజాం- 36 కోట్లు
సీడెడ్- 13 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌- 12.50 కోట్లు
తూర్పు- 8.50 కోట్లు
పశ్చిమ- 7 కోట్లు
గుంటూరు- 9 కోట్లు
కృష్ణ- 7.50 కోట్లు
నెల్లూరు- 4కోట్లు
——————-
ఏపీ+తెలంగాణ‌= రూ. 97.50 కోట్లు
——————-

క‌ర్ణాట‌క‌- 8.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3 కోట్లు
ఓవ‌ర్సీస్‌- 11 కోట్లు
——————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌= రూ. 120 కోట్లు
——————-


Share

Related posts

మహేశ్-రాజమౌళి ప్రాజెక్టుపై వైరల్ అవుతున్న న్యూస్!

Muraliak

మోసం చెయ్యడం మంచిది కాదు

Siva Prasad

మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు…

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar