సినిమా

Sarkaru Vaari Paata SVP: 3 రోజుల్లో స‌గం టార్గెట్ ఔట్‌.. మ‌హేష్‌ మాస్ జాత‌ర మామూలుగా లేదు!

Share

Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు (Prince Mahesh Babu) నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. (SVP) ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సముద్రఖని ఇందులో విల‌న్‌గా చేయ‌గా.. నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజి, తనికెళ్ల భ‌ర‌ణి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే 12న విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న సొంతం చేసుకుంది. తొలి రోజు నెగ‌టివ్ రివ్యూలు సైతం తెగ స్ప్రెడ్ అయ్యాయి. కానీ, అవేమి ప‌ట్టించుకోకుండా ప్రేక్ష‌కులు స‌ర్కారు వారి పాట‌ను చూసేందుకు థియేట‌ర్స్‌కు క్యూ క‌డుతున్నారు.

దీంతో మ‌హేష్ బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ జాత‌ర సృష్టిస్తున్నారు. మొద‌టి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 36.01 కోట్ల షేర్, రెండో రోజు రూ. 11.04 కోట్ల షేర్ ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. మూడో రోజు మ‌రింత పుంజుకుని రూ. 12.01 కోట్ల రేంజ్‌లో షేర్‌ను ద‌క్కించుకుంది. దీంతో స‌గానికి పైగా టార్గెట్ ఔట్ అయిపోయింది. ఇక‌ ఏరియాల వారీగా స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 22.48 కోట్లు
సీడెడ్: 7.38 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 7.34 కోట్లు
తూర్పు: 5.39 కోట్లు
పశ్చిమ: 3.64 కోట్లు
గుంటూరు: 6.80 కోట్లు
కృష్ణ: 3.75 కోట్లు
నెల్లూరు: 2.30 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ‌= 59.06 కోట్లు(84.40 కోట్లు~ గ్రాస్)
———————-

రెస్ట్ ఆఫ్ ఇండియా+క‌ర్ణాట‌క‌: 3.95 కోట్లు
ఓవ‌ర్సీస్‌- 9.21 కోట్లు
————————
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌: 72.22 కోట్లు(112 కోట్లు~ గ్రాస్)
————————

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిన స‌ర్కారు వారి పాట‌.. రూ. 121 కోట్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అయితే ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే మొద‌టి మూడు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 48.78 కోట్ల షేర్ ని రాబ‌ట్టాల్సి ఉంటుంది.


Share

Related posts

శివకుమార్‌ బి. తొలి చిత్రం ’22’

Siva Prasad

Keerthi suresh: కీర్తి సురేశ్ ఇప్పుడైనా ఆ రూమర్స్ నుంచి బయటపడుతుందా..?

GRK

మహేష్ బాబు సర్కారు వారి పాట ఇప్పట్లో లేనట్టే .. దర్శకులకి మంచి ఛాన్స్ ..?

GRK