సినిమా

SVP: “సర్కారు వారి పాట” సెన్సార్ డీటెయిల్స్..!!

Share

SVP: డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” ఈనెల 12వ తారీకు రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహేష్ ని గ్లామరస్ గా చూపిస్తూనే మరోపక్క సరికొత్త మాస్ యాంగిల్ లో దూకుడు, పోకిరి తరహాలో ప్రజెంట్ చేశారని.. ట్రైలర్.. ఫోటోలు చూసి అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.

Sarkaru Vaari Paata Sensor movie details

ఇదిలా ఉంటే మే ఏడవ తారీఖు సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. రెండు సంవత్సరాల తర్వాత మహేష్ మూవీ విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ కి అభిమానులు పోటెత్తారు. ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే సినిమా విడుదల అవ్వడానికి టైం ఉండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలకి సంబంధించి స్పీడ్ పెంచటం జరిగింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా “సర్కారీ వారి పాట” సెన్సార్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కాగా, ఈ సినిమా నిడివి 162 నిమిషాల 25 సెకన్లు. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇంకా కేవలం సినిమా విడుదల అవ్వటానికి కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో… “సర్కారు వారి పాట” థియేటర్ల వద్ద అభిమానుల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కచ్చితంగా “సర్కారు వారి పాట” విజయం సాధిస్తుందని హీరో మహేష్ బాబుతో పాటు సినిమా యూనిట్ ధీమాగా ఉంది.


Share

Related posts

ద‌ర్శ‌కుడిగా మోహ‌న్‌లాల్ అరంగేట్రం

Siva Prasad

RRR: `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కు అలియా షాక్‌.. రిలీజ్‌కు ముందు ఇలా చేస్తుందేంటి?

kavya N

RRR: RRR ప్రమోషన్స్ కోసం రాజమౌళి దేన్నీ క్షమించడంలేదు?

Ram