న్యూస్ సినిమా

Sarkaru vaari paata: ప్రేమికుల రోజున మొదటి పాట..సాలీడ్ పోస్టర్‌తో అప్‌డేట్..

Share

Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్ వచ్చేసింది. నేడు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్బంగా సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. మహేష్ బాబు హీరోగా, బ్యూటిఫుల్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. మహేశ్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి.

sarkaru-vaari-paata solid poster release on valentines day
sarkaru-vaari-paata solid poster release on valentines day

అయితే, తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సంగీత దర్శకుడు థమన్ పోస్టర్‌ను వదిలారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌తో పాటు టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ ఏకంగా సినిమా మీద భారీ అంచనాలను పెంచాయి. వరుస సక్సెస్‌లను అందుకుంటున్న మహేశ్ ఖాతాలో మరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవబోతోందని ఆయన అభిమానులు ఎంతో నమ్మకంగా చెప్పుకుంటున్నారు. వాస్తవంగా మహేశ్ బృందం ప్రకటించిన దాని ప్రకారం సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది.

Sarkaru vaari paata: మహేశ్ – కీర్తి సురేశ్‌లపై చిత్రీకరించిన రొమాంటిక్ పాట..!

కానీ, పోస్ట్ పోన్ చేస్తూ ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామంటూ కొత్త తేదీని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మ్యూజికల్ అప్‌డేట్స్ ఏవీ రాకపోవడంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఎట్టకేలకు థమన్ సాలీడ్ పోస్టర్‌తో వచ్చి మహేశ్ అభిమానులను ఖుషీ చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న సర్కారు వారి పాట సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. లవర్స్ డే రోజున విడుదల కానుంది కాబట్టి…గ్యారెంటీగా ఈ ఫస్ట్ సింగిల్ మహేశ్ – కీర్తి సురేశ్‌లపై చిత్రీకరించిన రొమాంటిక్ పాట అయి ఉంటుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారో తెలియాలంటే 14 ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.


Share

Related posts

(పార్ట్-2) నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! అమూల్ కి అంత ఈజీ కాదు..!!

Srinivas Manem

పుల్వామా ఘటన భయానకం: ట్రంప్‌

somaraju sharma

Ranabhir Alia: రణబీర్- ఆలియా భట్ ల పెళ్లి తేదీ డీటెయిల్స్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar