సినిమా

Sarkaru Vaari Paata: సర్కారు వారి సెలబ్రేషన్స్ షురూ.. సరిలేరు మాకెవ్వరంటూ ప్లానింగ్!

Share

Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ త్వరలో థియేటర్లో సందడి చేయనుంది. దాంతో మహేష్ అభిమానులు ఇప్పటినుండే సందడి చేస్తున్నారు. హైదరాబాద్ AMB సినిమా హాల్ లో పండగ వాతావరణం కనబడుతోంది. ఫాన్స్ బాణాసంచాతో మహేష్ బాబు కి వెల్కమ్ చెబుతున్నారు. మహేష్ నుంచి సినిమా వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ నుంచి మరో సినిమా రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాకోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata Team Started Celebrations
Sarkaru Vaari Paata Team Started Celebrations

Sarkaru Vaari Paata: సినిమా ప్రొమోషన్స్ షురూ…

‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ కు మరో వారం రోజులే వుండటంతో మేకర్స్ ప్రొమోషన్స్ షురూ చేసారు. ఇక ఈ మూవీ నుండి వచ్చిన పాటలు, ట్రైలర్ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించాయో చెప్పనవసరం లేదు. చాలా కాలంగా మహేష్ నుంచి అభిమానులు ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్ని కోరుకుంటున్నారో అలాంటి సినిమాని అందించబోతున్నామంటూ మేకర్స్ హింట్ ఇవ్వడంతో ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని మహేష్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Sarkaru Vaari Paata Team Started Celebrations
Sarkaru Vaari Paata Team Started Celebrations

తారాస్థాయిలో ప్రొమోషన్స్

తాజాగా మేకర్స్ ఫాన్స్ కి కిక్కిచ్చే మరో అప్ డేట్ ని విడుదల చేసారు. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ కి సంబంధించిన డేట్ ని ప్లేస్ ని కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7 శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు. ట్రైలర్ లో మహేష్ క్రేజీగా కనిపించి తన ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ట్రైలర్ ఇప్పటికే 30 మిలియన్ ల వ్యూస్ ని క్రాస్ చేసి మరో రికార్డు దిశగా పయనిస్తోంది. ఇక సినిమా ఏరేంజ్ లో వుంటుందో అని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు వేస్తూ మరో సెలబ్రేషన్ కి రెడీ అయిపోతుండటం కొసమెరుపు.


Share

Related posts

Pranitha Subhash Beautiful Looks

Gallery Desk

చిరంజీవి ఆచార్య మోషన్ పోస్టర్ సూపర్ – కానీ కొరటాల మీద కోపంగా ఉన్న మెగా వీరాభిమానులు !

arun kanna

బిగ్ బాస్ 4 : అభి పై తన ప్రేమ బయటపెట్టిన హారిక..! వామ్మో… అంతకు తెగించిందా?

arun kanna