సినిమా

SVP: 24 గంటలు కాకముందే “సర్కారు వారి పాట” ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డ్ లు..!!

Share

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం “సర్కార్ వారి పాట” ట్రైలర్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. “పోకిరి”, “దూకుడు” మాదిరిగా మహేష్ పర్ఫామెన్స్ కనబడుతుంది. ఇక కీర్తి సురేష్ ప్రజెన్స్ కూడా అదరగొడుతోంది.

"sarkaru vaari paata" trailer records details

శ్రీకాకుళం యాస భాషలో మహేష్ డైలాగులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అనేక రికార్డులు సృష్టించింది. అత్యధిక 100k, 300K, 900K లైకులు, అత్యధిక 5M, 8M, 10M, 15M, 20M వ్యూస్ సాధించిన ట్రైలర్ గా సోషల్ మీడియా లో రికార్డులు క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతుంది. 24 గంటలు కాకముందే… “సర్కారు వారి పాట” ట్రైలర్ విధ్వంసం సృష్టిస్తుంది. మహేష్ “సర్కార్ వారి పాట” తన కెరీర్లో మరో “పోకిరి” అవుతుందని గతంలో చేసిన కామెంట్లు ట్రైలర్ చూసిన తర్వాత గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు.

"sarkaru vaari paata" trailer records details

మే 12వ తారీకు ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా మళ్లీ వస్తూ ఉండటంతో… “సర్కారు వారి పాట” కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో మహేష్ జాయిన్ కానున్నారు. ఆ తర్వాత బిగ్గెస్ట్ ప్రాజెక్టు రాజమౌళి సినిమా లో మహేష్ నటించనున్నట్లు సమాచారం.


Share

Related posts

ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు మెగా మేనల్లుడి మీదే ఆధారపడి.. అది మెగా పవర్ అంటే ..!

GRK

Samantha Akkineni Beautiful Clicks

Gallery Desk

Rajamouli: ఢిల్లీ ఎయిర్ పోర్టుపై రాజమౌళి అసంతృప్తి..!! ఢిల్లీ ఎయిర్ పోర్టు స్పందన ఏమిటంటే..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar