Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు – పరశురామ్ కాంబో ”సర్కారు వారి పాట” సినిమాని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారనే విషయం తెలిసినదే. ఈ క్రమంలో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ‘సర్కారు వారి పాట’ ప్రచార కార్యక్రమాలు వేగంగా జరగడం లేదని మహేష్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో వున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ ప్లాన్ చేయడంతో ఖుషీ అవుతున్నారు ఫాన్స్. ఇటీవలే సర్కారు వారి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసిన టీమ్.. సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఏఎస్ ప్రకాష్ తో కలిసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. గత రెండు రోజులుగా ఆయన వరుసగా ఎలక్ట్రానిక్ – ప్రింట్ మీడియా మరియు వెబ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mahesh Babu: వేరేలెవల్ బ్రాండింగ్ అంటే ఇదే
బేసిగ్గా సినిమా ప్రమోషన్స్ అంటే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో వంటి వారి హంగామా మనకు కనిపిస్తుంది. కానీ SVP ప్రచార కార్యక్రమాలు చాలా మందికి తెలియని AN ప్రకాష్ తో ప్రారంభించారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చే దిశగా ఆలోచిస్తూనే, ఇలాంటివారు చేస్తే ఇంకా జెన్యూన్ గా వుంటుందనే కోణాల్లో చేసిన ఆలోచన అని తెలుస్తోంది. AN ప్రకాష్ కు ‘సర్కారు వారి పాట’ 7వ సినిమా. ఇందులో సెట్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. దాదాపు 80 శాతం షూటింగ్ సెట్స్ లోనే జరిగిందని ఆర్ట్ డైరెక్టర్ చెబుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అంచనాలు అమాంతం పెంచేసిన ఆర్ట్ డైరెక్టర్:
సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి.. వారిని ఎక్స్ పోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే నెపంతోనే ఇలా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారని వినికిడి. AN ప్రకాష్ ఓ మీడియా వేదికగా ఇంటర్వ్యూ ఇస్తూ ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని.. ఇందులో మహేష్ డ్యాన్స్ విశ్వరూపం చూస్తారని అంటూ ఈ ఆర్ట్ డైరెక్టర్ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ రెండు వారాల్లో SVP ని వార్తల్లో నిలపాలని కోరుకుంటున్న మేకర్స్.. రాబోయే రోజుల్లో ఇతర కీలకమైన టెక్నీషియన్లతో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్లిన మహేష్.. తిరిగి వచ్చిన వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!