Pushpa: సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించిన డైరెక్టర్ బుచ్చిబాబు ఉప్పెనతో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు మరియు నిర్మాతలు బుచ్చిబాబు తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో బుజ్జి బాబు పేరు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో “పుష్ప” సినిమా మొదటి భాగం ఇటీవల చూసి తన గురువు సుకుమార్ స్టోరీ రైటింగ్ పై అసూయ కలుగుతుందని సినిమా చాలా అద్భుతంగా ఉందని “10 కేజిఎఫ్” లు కలిపితే ఒక “పుష్ప” అవుతుందని చెప్పుకొచ్చాడు.
దీంతో బుచ్చిబాబు ఇచ్చిన రివ్యూ స్టేట్మెంట్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా వైరల్ గా మారింది. ఇటువంటి తరుణంలో “కేజిఎఫ్” సినిమా దేశవ్యాప్తంగా కలిపి 200 కోట్లు సాధించింది. దీన్నిబట్టి చూసుకుంటే అది “కేజిఎఫ్” లు అంటే “పుష్ప” రెండు వేల కోట్లు సాధిస్తుందా అంటూ తాజాగా బుచ్చిబాబు… ఇచ్చిన రివ్యూ కామెంట్లపై కౌంటర్లు సెటైర్లు వేస్తున్నారు.
Read More: Pushpa: పుష్ప సినిమాలో హైలెట్ ఫైట్ అదేనట..??
అల్లుఅర్జున్ అభిమానులకు బుచ్చిబాబు రివ్యూ ఆనందంగా ఉన్న మిగతా బన్నీ అండ్ ఫ్యాన్స్ మాత్రం.. తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్కసారిగా పుష్ప మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన కేజిఎఫ్ తో బుచ్చిబాబు పోల్చటం సౌత్ లో మాత్రమే కాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పుష్ప మూవీ మొదటి భాగం పెద్ద హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా ఫస్ట్ పార్ట్ పై బుచ్చి బాబు చేసిన కామెంట్స్ గతంలో కంటే మరింతగా అంచనాలను పెంచినట్లు అయ్యింది.