వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పటికే పోస్టర్స్ తో, సాంగ్స్ తో చేయాల్సిన రచ్చ చేసి… కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న వర్మ, మరోసారి ‘ఎందుకు’ అనే పాటని రిలీజ్ చేశాడు. ఎంతోమంది అందమైన వాళ్ళతో నటించిన ఎన్టీఆర్, వాళ్లని కాదని లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? కుటుంబం అంతా వద్దన్నా, వాళ్లని పక్కకి నెట్టి ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? వైస్రాయ్ హోటల్ లో లక్ష్మీ పార్వతి వల్లే గొడవ జరుగుతుంటే అక్కడికి ఆమెనే ఎందుకు తీసుకువెళ్లాడు? అంటూ రకరకాల సందర్భాల్లో అసలు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అని ప్రశ్నించే విధంగా ఈ పాట ఉంది. నందమూరి తారక రామారావు జీవితంలోని నిజాలని ప్రజలకి తెలియజేస్తానని చెప్పిన వర్మ, ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
వర్మ మరో బాంబు పేల్చాడు
Advertisements
Advertisements