Ram Charan: చిరంజీవి వారసుడిగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ తండ్రికి తగ్గ తనయుడి మాదిరిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని “RRR” తో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించడం జరిగింది. ప్రొఫెషనల్ గా ఎంత క్రమశిక్షణగా సినిమాలు చేసుకుంటూ పోతాడో వ్యక్తిగత జీవితంలో స్నేహితులకి చరణ్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని చరణ్ సన్నిహితులు కూడా చెబుతుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం చరణ్ లో ఉంటుందని చెబుతారు.
ఈ క్రమంలో తాజాగా చరణ్ మరియు ఉపాసన ఇద్దరికీ బెస్ట్ ఫ్రెండ్ రోస్మిన్ మాధవ్ జీ పెళ్లి వేడుక ప్యారిస్ లో జరిగింది. ఈ పెళ్లిలో పాల్గొన్న చరణ్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చరణ్ రొటీన్ కి భిన్నంగా ఆఫ్ లైన్ స్టైల్ దుస్తులలో పెళ్లిలో మెరిసిపోయాడు. డిజైనర్ ఫరాజ్ మీనన్ రూపొందించిన ఈ దుస్తులను ధరించి వేడుకల సంథింగ్ స్పెషల్ గా నిలిచాడు. ఉపాసన కూడా బంగారు రిచ్ బ్రౌన్ అనార్కలి సూట్ ధరించి మెరిసిపోయింది. ఈ క్రమంలో అందమైన ఈ జంట స్నేహితులతో కలిసి ఫ్యాషన్ షో మాదిరిగా ఫోటోలకు ఫోజులిస్తూ పెళ్లిలో సందడి చేశారు. దీంతో ఫ్రెండ్స్ అంతా కలిసి ఎగబడి మరి ఫోటోలకు ఎవరికి వారు స్టైల్ ఇవ్వటం జరిగింది. చాలా వరకు గ్రూప్ ఫోటోలు దిగారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. చరణ్ లేటెస్ట్ లుక్ గతానికి భిన్నంగా చాలా వెరైటీగా ఉండటంతో పారిస్ పెళ్లి వేడుకలలో దిగిన ఫోటోలకి భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం చరణ్ “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమానీ దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం.