Allu Arjun Sai Pallavi: 69 ఏళ్ల భారతీయ చలనచిత్ర రంగంలో మొట్టమొదటిసారి జాతీయ ఉత్తమ అవార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇటీవల వచ్చింది. 2021 ఏడాదికి సంబంధించి “పుష్ప” సినిమాకి గాను బన్నీకి ఈ అవార్డు వరించింది. దీంతో చాలామంది ప్రముఖులు సినిమా సెలబ్రిటీలు అభినందనలు తెలియజేశారు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా హీరోయిన్ పాత్రలో రష్మిక మందన నటించడం జరిగింది. అసలు ఈ సినిమాని మహేష్ బాబు కోసం సుకుమార్ స్టోరీ సిద్ధం చేసుకున్నారు. అంతా కన్ఫర్మ్ అనుకున్న సమయంలో చివరి నిమిషంలో మహేష్ రిజెక్ట్ చేయగా.. బన్నీకి అదృష్టం వరించింది. అప్పటికే “అలా వైకుంఠపురంలో” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బన్నీ “పుష్ప” సినిమాను ఓకే చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
అయితే “పుష్ప” సినిమా విషయంలో హీరో మాదిరిగానే హీరోయిన్ విషయంలో కూడా మార్పు చోటు చేసుకుందట. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా బన్నీ హీరోగా కన్ఫర్మ్ అయిన తర్వాత.. శ్రీవల్లి పాత్ర కోసం సాయి పల్లవి కరెక్ట్ అని సుకుమార్.. డిసైడ్ అయ్యారట. ఇదే క్రమంలో అల్లు అర్జున్ మంచి నిర్ణయమని చెప్పటంతో ప్రొసీడ్ అయిన సుకుమార్.. సాయి పల్లవికి స్టోరీ మొత్తం వినిపించడం జరిగింది అట. అంతా బాగానే ఉన్నా గాని సినిమాలో రొమాంటిక్ సీన్ ఉండటంతో.. చేయను అని రిజెక్ట్ చేసినట్లు టాక్. అయితే కథకి ఆ సీన్ ఉండాల్సిందే అని చెప్పటంతో సాయి పల్లవి నిర్మొహమాటంగా చేయను అని చెప్పేసింది అంట. ఒకవేళ నిజంగా శ్రీవల్లి పాత్ర సాయి పల్లవి చేసి ఉంటే. డాన్స్ తో పాటు నటన ఇరగదీసేదని, సామి సామి సాంగ్ ఇంకా అతిపెద్ద హిట్ అయ్యేదని తాజా వార్త జనాలు కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క సాయి పల్లవి విపరీతంగా అభిమానించేవారు అంత మొంకి పట్టుదల… అహంకారం పనికిరాదని.. అల్లు అర్జున్ అంటే అభిమానం ఉన్నా కానీ సినిమా రిజెక్ట్ చేయడం.. దారుణమని ఈ వార్తపై స్పందిస్తున్నారు.
గతంలో సాయి పల్లవి తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమని ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోను..అనీ తెలిపింది. ఆ ఒక్క రొమాంటిక్ సీన్ కోసం “పుష్ప” సినిమా సాయి పల్లవి వదులుకున్నట్లు తాజాగా వార్తలు రావడంతో.. ఆమెను అభిమానించే మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అంటూ ఫీలవుతున్నారు. ఇదిలా ఉంటే “పుష్ప” సెకండ్ పార్ట్ లో ఐటెం సాంగ్ కి కూడా ఇటీవల నేషనల్ అవార్డు హీరో అల్లు అర్జున్, సాయి పల్లవినీ .. డైరెక్టర్ సుకుమార్ కి రిఫర్ చేయడం జరిగిందట. ఎట్టి పరిస్థితుల్లో ఐటెం సాంగ్స్ మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం జరిగింది అని టాక్. దీంతో సాయి పల్లవికి మరి అంత అహంకారం పనికిరాదని కామెంట్లు వస్తున్నాయి.