Sekhar Kammula: సీనియర్ హీరోని లైన్ లో పెడుతున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల..??

Share

Sekhar Kammula: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా స్టైలిష్ గా అదేవిధంగా క్లాసికల్ గా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు శేఖర్ కమ్ముల. మొదటి సినిమా ఆనంద్ తో ప్రేక్షకులను అలరించిన ఈ డైరెక్టర్ ఎంతోమంది కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. క్లాస్, మాస్ ఆడియన్స్ ని  అలరించే రీతిలో చాలా కూల్  సబ్జెక్టులతో..  శేఖర్ కమ్ముల టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక విషయాలు  సాధిస్తూ ఉంటారు. చాలావరకు కొత్త వారితో సినిమాలు చేయడానికి ఇష్టపడే శేఖర్ కమ్ముల ఇటీవల స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నారు.

Sekhar Kammula Directs senior hero
Sekhar Kammula Directs senior hero

మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో పాటు తాజాగా నాగచైతన్య తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ తో “ఫిదా” సినిమా తో అదిరిపోయే హిట్ అందుకోగా తాజాగా ..నాగచైతన్య తో “లవ్ స్టోరీ” సినిమా చేస్తున్నారు. 2020 వ సంవత్సరం లోనే రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ.. పాండమిక్ దెబ్బకి.. వాయిదాలు పడుతూ ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయడానికి శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ గా వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే వెంకటేష్ కి  స్టోరీ చెప్పినట్లు అంతా ఓకే అయ్యినట్లు వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో గట్టిగా వినబడుతున్నాయి.

 

క్లాస్, మాస్ ఆడియన్స్ ని మెప్పించడం లో వెంకటేష్ సిద్ధహస్తుడు అని తెలుసు. ఎలాంటి స్క్రిప్ట్ అయినా గాని అలవోకగా ఒదిగి పోయి.. ప్రేక్షకులను నవ్వించడం, ఏడిపించడం లో వెంకటేష్ ని మించిన మరో హీరో ఉండరు అని చెప్పవచ్చు. ఇటువంటి సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ కలిగిన హీరోతో సరైన స్క్రిప్టుతో శేఖర్ కమ్ముల రాణించాడు అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో మ్యాజిక్ చేయడం గ్యారెంటీ అని తాజా వార్త పై సోషల్ మీడియాలో సినీ ప్రేమికులు చర్చించుకుంటున్నారు. 

 

 

 

 

 


Share

Related posts

Dhee Grand Finale : వచ్చే వారం ఢీ షోను అస్సలు మిస్ కాకండి? కుర్రాళ్లు ఇరగదీశారు?

Varun G

షాకింగ్: గంగవ్వను ప్లాన్ ప్రకారం పంపించారట..! ఇక ‘బిగ్ బాస్’ని నమ్మేదెలా?

Teja

Veera Brahmendra Swamy Matam: వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపత్యంపై వివాదం!”పీఠ”ముడి వీడేనా? బిగుసుకునేనా??

Yandamuri