25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Actress Hema: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సీనియర్ నటి హేమ..!!

Share

Actress Hema: తెలుగు చలనచిత్ర రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటి హేమకు మంచి గుర్తింపు సాధించింది. ఎన్నో చలనచిత్ర రంగంలో కామెడీతో పాటు పలు విభిన్నమైన పాత్రలు చేసి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటి హేమ చాలా సినిమాలు చేయడం జరిగింది. బ్రహ్మానందంతో హేమ కామెడీ టైమింగ్ అన్నిటికి మించి హైలెట్. ముఖ్యంగా మహేష్ బాబు త్రిష నటించిన అతడు సినిమాలో బ్రహ్మానందంతో హేమా కామెడీ ఇప్పటికీ కూడా హైలెట్. వారిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు థియేటర్ లో మాత్రమే కాదు.. టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తారు.

Senior actress Hema has started a new business

కరోనా రాకముందు సినిమా రంగంలో కీలకంగా రాణించి ఆ తర్వాత “మా” అధ్యక్ష ఎన్నికలలో కూడా పోటీ చేయడం జరిగింది. కానీ కరోనా పాండమిక్ తర్వాత హేమా చాలా వరకు సినిమా రంగానికి దూరమైంది. అయితే ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె ఇటీవల తెలియజేసింది. తాను ప్రారంభించిన కొత్త వ్యాపారంలో మంచి లాభాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. దీంతో సంపాదన ఎక్కువైపోవడంతో సుఖపడడానికి అలవాటైపోయినట్లు పేర్కొంది. దీంతో కష్టపడటానికి ఇష్టపడటం లేదని… తెలియజేసింది. అందుకే నటనకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది. ఇలా ఉంటే నటి హేమ ఏమి బిజినెస్ ప్రారంభించిందో అన్నది మాత్రం చెప్పలేదు.

Senior actress Hema has started a new business

నటి హేమ మాత్రమే కాదు చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎక్కువగా వ్యాపార రంగంలో వస్తూ ఉన్నారు. టెలివిజన్ రంగానికి చెందిన నటీనటుల సైతం వ్యాపారాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వాలు తీసుకున్న చాలా నిర్ణయాలకు షూటింగులు ఆగిపోయాయి. దీంతో చాలామంది సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న నటీనటులకీ పని లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఎక్కువగా సినిమా రంగం వైపు కాకుండా వ్యాపార రంగం వైపు కూడా నటీనటులు ఇంట్రెస్ట్ చూపిస్తూ వ్యాపారాలు చేయటానికి ముందుకు వస్తున్నారు.


Share

Related posts

Krishna Mukunda Murari: మురారినీ చూస్తూ తప్పటడుగు వేసిన ముకుంద.??

bharani jella

Krishna Mukunda Murari: మురారి కోసం దూకేసిన ముకుంద.. కృష్ణని మెచ్చుకున్న రేవతి..

bharani jella

Rashmika mandanna: ‘యానిమల్‌’తో ఇంత రొమాంటిక్‌గా ఉంటుందా..?

GRK