దర్శక దిగ్గజం ఇక లేరు

గత కొంతాకలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్న ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని గురువారం ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వెంటిలేటర్ మీద ఆయనకి చికిత్స పొందిన కోడి రామకృష్ణ ట్రీట్మెంట్ తీసుకుంటూనే శుక్రవారం ఉదయం మరణించారు.

1982లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ ఆ తరువాత టాలీవుడ్ ఎన్నో భారీ చిత్రాలను రూపొందించారు. తెలుగు సినిమాని గ్రాఫిక్స్ రంగు అద్దిన ఆ దర్శకుడు తీసిన ‘అమ్మోరు’,’అరుందతి’ చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. శతాధిక చిత్రాలకి దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇక లేరు అనే వార్తని టాలీవుడ్ జీర్ణించుకోలేపోతోంది.