ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తాతయ్య జె ఓం ప్రకాశ్(93) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. దర్శక నిర్మాతగా జె.ఓం ప్రకాశ్ తనదైన ముద్రవేశారు. ఆప్ కీ కసమ్, ఆస్పాస్, ఆంఖో ఆంఖో మే, అంధీ సహా పలు చిత్రాలను ఈయన రూపొందించారు. హృతిక్ గత నెలలో కూడా ఈయన్ని తన సినిమా ప్రమోషన్స్ సూపర్ 30లో భాగంగా కలుసుకున్నారు. ఓం ప్రకాష్ తన సూపర్ టీచర్ అని ట్వీట్ చేయడమే కాకుండా, తనకు చిన్నప్పుడు తడబడుతూ మాట్లాడే సమస్య ఉంటే దాన్ని గుర్తించి దాన్ని సరిచేశారని కూడా తెలియజేశారు హృతిక్. ఓంప్రకాశ్ మృతికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి.
previous post
next post