23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

Arjun vs Vishwek Sen: నా 42 ఏళ్ల కెరియర్ లో ఇటువంటి హీరోని చూడలేదు విశ్వక్ సేన్ పై అర్జున్ సీరియస్ కామెంట్స్..!!

Share

Arjun vs Vishwek Sen: మూడు నెలల క్రితం యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురు ఐశ్వర్యాన్ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో సినిమా ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే అర్ధాంతరంగా ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆగిపోయింది. విషయంలోకి వెళ్తే హీరో మరియు దర్శకుడు అర్జున్ తో విశ్వక్ సేన్ కి పడటం లేదు. దీంతో అర్ధాంతరంగా ప్రాజెక్టు మధ్యనుండే విశ్వక్ సేన్ వెళ్లిపోవడం జరిగింది.

senior hero arjun serious comments vishwek sen
Vishwek Sen

దీంతో అర్జున్…విశ్వక్ సేన్ పై ఫిలిం ఛాంబర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 42 ఏళ్ల ఫిలిం కెరియర్ లో ఇటువంటి హీరోని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. విశ్వక్ సేన్ కి కమిట్మెంట్ లేదని అన్నారు. నిర్మాతలకు మరియు దర్శకులకు మర్యాద కూడా ఇవ్వటం రాదు. రెమ్యూనరేషన్ విషయంలో అతను చెప్పినట్టే అంతా చేయడం జరిగింది. కానీ షూటింగ్ స్పాట్ లో విశ్వక్ సేన్ వ్యవహరించిన తీరు ఎంతో ఇబ్బందిని కలిగించింది. షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందుల గురి చేశారు.

senior hero arjun serious comments vishwek sen
Vishwek Sen

నా జీవితంలో విశ్వక్ సేన్ కి చేసిన అన్ని ఫోన్లు ఎవరికి చేయలేదు. అయితే ముందుగా ప్రకటించిన అనుకున్న షెడ్యూల్ పూర్తిగా మార్చేయాలని ఓకే అయ్యాక చెబితే ఎలా అంటూ అర్జున్ తన ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది కమిట్మెంట్స్ షెడ్యూల్ అంతా రెడీ అయ్యాక మొత్తం మార్చాలంటే ఎలా..? “ఇకపై విశ్వక్ తో వర్క్ చేయను. అలాంటి వాళ్ళతో పని చెయ్యలేం. సినిమా ఇండస్ట్రీలో నిబద్ధతలేని, క్రమశిక్షణ లేని హీరో ఎదగడు,” అని తెగేసి చెప్పారు. ఈ రీతిగా విశ్వక్ సేన్ ఇబ్బందులు గురిచేసినట్లు మీడియా సముఖంగా అర్జున్ తెలియజేయడం జరిగింది.


Share

Related posts

ప్రభాస్ ని కావాలనే బయటకు లాగుతున్నారా …?

GRK

దారుణంగా మారిపోయిన కీర్తి సురేష్.. ఆందోళనలో మహేష్ ఫ్యాన్స్!

Teja

Mega 154: సంక్రాంతి మరో సినిమా విడుదల చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి అధికారిక ప్రకటన..!!

sekhar