Khushi: 2002వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ భూమిక కలిసిన నటించిన “ఖుషి” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఏఎం రత్నం తెరకెక్కించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో పవన్ ఇమేజ్ ఒక్కసారిగా డబల్ అయింది. ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ చేసిన ఫైట్స్ మేనరిజం యూత్ ని ఏంతగానో ఆకట్టుకున్నాయి. మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలెట్. అన్ని రకాలుగా ఈ సినిమా అప్పట్లో అందరిని అలరించింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు రిలీస్ చేస్తున్న ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు.

ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టినరోజు నేపథ్యంలో మొట్టమొదటిసారి “పోకిరి” మళ్లీ రిలీజ్ లేటెస్ట్ టెక్నాలజీతో విడుదల చేయించేలా నిర్మాతలపై ఒత్తిడి తెచ్చారు. ఈ రకంగా చాలామంది స్టార్ హీరోల అభిమానులు తమ హీరోకి సంబంధించి అతిపెద్ద విజయం సాధించిన సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో “ఖుషి” సినిమా మళ్లీ ఈ ఏడాది డిసెంబర్ 31వ తారీకు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా భూమిక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. వీడియోలో..”ప్రతిఒక్కరు థియేటర్ కి వెళ్లి సినిమా చూసి.. ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

ఇక ఇదే సమయంలో హీరో పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సూర్య ఇంకా నిర్మాత ఏఏం రత్నానికి స్పెషల్ థాంక్స్ అని భూమిక తెలియజేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలాచోట్ల “ఖుషి” స్పెషల్ షోలు పడుతున్నాయి. ఈ స్పెషల్ షోలకు సంబంధించిన టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సరిగ్గా న్యూ ఇయర్ రోజుకు ముందు పవన్ సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతూ ఉండటంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున టికెట్లు కొంటున్నారు.
Here's our Madhu aka @bhumikachawlat talking about the #Kushi4K Grand Re-Release. 😍
Bookings Opened 🎟️ – #Kushi4K – https://t.co/kTXatuM6b3@PawanKalyan @iam_SJSuryah @pcsreeram #ManiSharma @AMRathnamOfl pic.twitter.com/DuZ40xTcrg
— Mega Surya Production (@MegaSuryaProd) December 28, 2022