Pushpa 2: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” దేశవిదేశాలలో కలెక్షన్ల పరంగా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం బన్నీ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా కి… దేశ విదేశాల్లో ఉండే సెలబ్రిటీలు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా బన్నీ పలికిన డైలాగులు వేసిన స్టెప్పులు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో రీమేకులు చేస్తూ వీడియోల రూపంలో.. పుష్ప కి అదనపు గ్లామర్ తీసుకొచ్చారు.
దేశ విదేశాల క్రికెటర్లు సైతం అల్లు అర్జున్ డాన్స్ లు మరియు మేనరిజం తగ్గేదెలా వంటివి … సాక్షాత్తు గ్రౌండ్ లోనే కొంతమంది చేయటం మనం చూశాం. హిందీ లో ఈ సినిమా ఏకంగా బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకి మంచి పోటీ ఇచ్చి రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఈ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో… సీనియర్ హీరోయిన్ కి అవకాశం ఇవ్వడానికి సుకుమార్ రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
మేటర్ లోకి వెళ్తే ఆమె మరెవరో కాదు నటి ఇంద్రజ. గతంలో సుకుమార్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న నటీనటులే సెకండ్ పార్ట్ లో ఉంటారని… తెలియజేశారు. కానీ ఇటీవల కథలో కొన్ని మార్పులు చేయటం తో.. సీనియర్ హీరోయిన్ ఇంద్రజకి ఓ కీలక పాత్ర రాసినట్లు ఆమె ఒప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అంతే కాకుండా రెండో భాగం లో బన్నీ… ని ఎర్ర చందనానికి మాఫియా లీడర్ గా చూపించడానికి సుకుమార్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పుష్ప సెకండ్ పార్ట్ కి.. ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం.