RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా చరణ్ కెరీర్లో 15వది కావడం ఓ విశేషమైతే, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంస్థకు ప్రతిష్ఠాత్మకక 50వ సినిమా కావడం మరో విశేషం. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇక ఇప్పటికే మ్యూజిక్ సెన్షేషన్ తమన్ సంగీత దర్శకుడిగా కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అంతేకాదు, ఓ సాంగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చరణ్, తారక్ కలిసి నటించిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజయ్యాక మళ్ళీ చరణ్ ఆర్సీ 15 షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు.
RC 15: రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా అరవింద స్వామీని తీసుకున్నారట..!
అయితే, తాజా సమాచారం ప్రకారం ఒకప్పటి స్టార్ హీరో అరవింద్ స్వామీ ఈ సినిమా కోసం శంకర్ బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇంతక ముందు చరణ్ నటించిన ధృవ సినిమాలో అరవింద్ స్వామీ స్టైలిష్ విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా లో చరణ్ తర్వాత హైలెట్‌గా నిలిచింది ఆయన పాత్రే. అయితే, ఆ తర్వాత చాలామంది దర్శక, నిర్మాతలు భారీ ప్రాజెక్ట్స్ కోసం ట్రై చేసినా కూడా అరవింద్ స్వామీ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారట. కాని, ఆర్సీ 15 భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే, రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా అరవింద స్వామీని తీసుకున్నారని తెలుస్తోంది.