29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Aamani: స్టార్టింగ్ లోనే బీర్ తాగించేశారు.. ఇండస్ట్రీలో కష్టాల గురించి సీనియర్ హీరోయిన్ ఆమని సంచలన వ్యాఖ్యలు…!!

Share

Aamani: సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో ఆమె నటించిన మావిడాకులు, శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు..గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా “సిసింద్రీ” సినిమా అప్పట్లో చాలా హైలెట్. అఖిల్ తల్లిగా ఆమని నటన ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు నేటివిటికి సహజ తత్వంగా ఆమని నటన ఉంటుంది. అయితే కెరీర్ పరంగా మంచి ఊపు మీద ఉన్న సమయంలో… ఒక్కసారిగా సినిమా నుండి తప్పుకుని పూర్తిగా వ్యక్తిగత జీవితానికి పరిమితం కావడం జరిగింది. ఆ టైంలో ఏ సినిమాలు చేయకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇటీవల మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమని పాల్గొంది.

Sensational comments of senior heroine Amani about difficulties in the industry

ఈ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో కష్టాలు గురించి ఇంకా అనేక విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన మొదటి సినిమా జంబలకడిపంబ షూటింగ్ చేస్తున్న సమయంలో మందు కొట్టే సన్నివేశం గురించి దర్శకుడు వివరించారు. అయితే ఆ టైములో మందు కొట్టే సీన్ ఉంటుందని నాకు దర్శకుడు చెప్పలేదు. అయితే ఆ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో బాటిల్ లో కూల్ డ్రింక్ కలిపి ఇస్తారేమో అని అనుకున్నాను. కానీ నిజంగా బీరు ఇచ్చి జస్ట్ ఒక సిప్ వేయమన్నారు. ఆ సినిమాలో హీరో నరేష్ కూడా ఏం కాదు తాగొచ్చు అని బలవంతం చేశారు. ఆ విధంగా మొదటి సినిమాలోనే మందు తాగే సన్నివేశం తనపై చిత్రీకరించారని తెలియజేశారు. మంచి టైంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటమే తన లైఫ్ లో చేసుకున్న అదృష్టం అని తెలిపారు. అప్పట్లో తన తోటి హీరోయిన్స్ సౌందర్య, రమ్యకృష్ణ, రోజా…లతో మంచి స్నేహంగా ఉండేదాన్ని అని తెలిపారు. నా సినిమాలు నచ్చితే వాళ్లు అభినందించేవారు. మా మధ్య ఎటువంటి ఇగో ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. “మిస్టర్ పెళ్ళాం” నాకు అవార్డు తెచ్చిపెడుతుందని.. “శుభసంకల్పం”లో కమల్ గారి సరసన నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. అదేవిదంగా అవకాశం దగ్గరికి వచ్చిన సమయంలో… ఎప్పుడు స్టోరీ గురించి ఇంకా డబ్బు గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవారు కచ్చితంగా… నాకు సూట్ అయ్యే పాత్రలు తోనే వచ్చేవారు.

Sensational comments of senior heroine Amani about difficulties in the industry

స్క్రిప్ట్ విషయాలలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు కూడా నటనతో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సినిమాలు ఒప్పుకునేదాన్ని. అయితే సినిమా అవకాశాల కోసం ప్రారంభంలో అమ్మతో కలిసి అనేక ఫోటో షూట్ లలో పాల్గొనేదాన్ని. ఈ క్రమంలో కొన్నిచోట్ల మేకప్ టెస్ట్ కోసం అమ్మ లేకుండా ఒంటరిగా గదిలోకి రమ్మనే వారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకొని మేము వద్దనుకుని ఇద్దరం బయటికి వెళ్లిపోయే వాళ్ళం. సినిమాల్లో నటించాలనే పిచ్చి ఉంది. కానీ అడ్డదారుల్లో రావాలనే లేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ప్రారంభంలో అడుగుపెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది అంటూ ఆమని ఇండస్ట్రీ కష్టాలు గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


Share

Related posts

చిరంజీవితో మ‌రోసారి ..!

Siva Prasad

Shanmukh Jaswanth : షణ్ముఖ్ గురించి ‘ ఆ న్యూస్ ‘ తెలియగానే దీప్తి సునైనా రియాక్షన్ ఏంటి ?

Ram

చేతినిండా చిత్రాలతో బిజీ అవ్వనున్న యోగా బ్యూటీ

Teja