25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Bhanupriya: ఆ రోగంతో బాధపడుతున్న అంటూ.. సీనియర్ హీరోయిన్ భానుప్రియ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Bhanupriya: సీనియర్ హీరోయిన్ భానుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 90లలో అనేక తెలుగు మరియు తమిళ సినిమాలలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భానుప్రియ అవకాశాలు అందుకోవటం జరిగింది. నటనలో మాత్రమే కాదు నాట్యంలో కూడా భానుప్రియ మంచి కళాపోషకురాలు. దాదాపు 110 సినిమాలలో హీరోయిన్ గా నటించడం జరిగింది. అప్పట్లో మరో శ్రీదేవి అని అభిమానులు భానుప్రియ నీ పిలిచేవాళ్ళు. ఫస్ట్ టైం “సితార” అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ.. మొదటి సినిమాతోనే బాగా ఆకట్టుకుంది.

Sensational comments of senior heroine Bhanupriya who is suffering from that disease

ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ భాషలలో కూడా నటించిన భానుప్రియ…రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి లో ప్రభాస్ తల్లిగా నటించింది. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది. అక్కడ కూచిపూడి నృత్యం నేర్పిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు సినిమా ప్రపంచానికి దూరమైన భానుప్రియ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో తాను అనారోగ్యానికి గురైనట్లు అనేక విషయాలు తెలియజేశారు. విషయంలోకి వెళ్తే తన భర్త చనిపోయిన నాటి నుంచి మెమొరీ లాస్ అయిందని.. డైలాగులు కూడా గుర్తుండటం లేదని తెలిపింది.

Sensational comments of senior heroine Bhanupriya who is suffering from that disease

అంతేకాదు డాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండటం లేదు అందువల్లనే డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా.. విరమించుకున్నట్లు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. తన భర్త చనిపోవడానికి ముందు తాను.. ఆయన విడిపోయినట్లు మీడియా భయంకరంగా ప్రచారం చేసింది. కానీ వాటిలో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఆయన ఇక్కడికి వస్తూ ఉండేవారు నేను అక్కడికి వెళుతూ ఉండేదాన్ని. ఇద్దరం వేరువేరుగా ఉన్నామనేది కేవలం పుకారు మాత్రమే. ప్రస్తుతం మా అమ్మాయి అభినయం లండన్ లో చదువుకుంటుంది. ఆమెకు సినిమాలు వైపు వచ్చే ఆలోచన లేదు అంటూ భానుప్రియ ఇంటర్వ్యూలో తెలియజేసింది.


Share

Related posts

Anju Kurian Latest Stills

Gallery Desk

జ‌గ‌ప‌తిబాబుని ప‌ట్టించుకోలేదా?

Siva Prasad

బ‌న్ని సినిమాలో ట‌బు లుక్ ఇదే!

Siva Prasad