33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Laya Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై సీనియర్ హీరోయిన్ లయ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Laya Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం. పవన్ సినిమాకి వచ్చిన ఓపెనింగ్ మరి ఏ హీరో సినిమాకి రావు. తొలి వారంలోనే దాదాపు సినిమా కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇంకా పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద లెక్కలు మారుతాయి. ఇక అదే రీతిలో ఆయన రోజువారి కాల్ షీట్స్ కూడా కొన్ని కోట్లల్లో ఉంటాయి. కేవలం నెల రోజులు సినిమా చేయడానికి 50 కోట్లు తీసుకునే మార్కెట్ కలిగిన హీరో. అటువంటి పవన్ గురించి సీనియర్ హీరోయిన్ లయ ఇటీవల ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.

Sensational comments of senior heroine Laya on Pawan Kalyan

హీరోయిన్ లయ ఒకప్పుడు తెలుగు చలనచిత్రా రంగంలో అనేక సినిమాలు చేయడం జరిగింది. గ్లామర్ పరంగా కాకుండా ఒద్దికగా తెలుగుతనంతో నిండే.. పాత్రలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించింది. ఆమె నటించిన స్వయంవరం.. ఇంకా కొన్ని సినిమాలు చాలా హైలెట్ గా ఉంటాయి. అయితే ఆమె పెళ్లి చేసుకున్నాక సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచేస్తుంది. తన పెళ్లికి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడం కోసం ఆయన ఇంటికి వెళ్తే.. చాలా ఆప్యాయంగా మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా గాని నాకు ఎంతగానో మర్యాద ఇచ్చారు.

Sensational comments of senior heroine Laya on Pawan Kalyan

ఇక అదే సమయంలో పెళ్లికి అందరికంటే ముందే ఆయన వచ్చారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే ఆయన్ని సరిగ్గా ఆహ్వానించలేకపోయాం. అంత సడన్ షాక్ ఇచ్చారు. అదే సమయంలో అన్నయ్య కూడా వస్తున్నారమ్మ.. దారిలో ఉన్నారని చాలా ఆప్యాయంగా అందరితో మాట్లాడారు. ఈ క్రమంలో భోజనం చేసి ఎల్లుండి సార్ అని చెబితే.. భోజనమా.. మళ్లీ చూద్దాం అంటూ నవ్వుతూ.. బదులిచ్చారు. నిజంగా ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆహ్వానించిన సమయంలో…పెళ్ళికి వస్తాను అనీ అన్నారు. కానీ ఆయన చాల పెద్ద స్టార్…నేను నమలేకపోయా. అయితే ఆయన ఇచ్చిన మాట ప్రకారం రావడం చాల సంతోషం అనిపించింది.  ఆయన ఒక్కరోజులో అంత సమయం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నా పెళ్ళికి వచ్చారంటే… మామూలు విషయం కాదు అంటూ లయ.. పవన్ ని పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది.


Share

Related posts

పునర్నవి ని ఫోన్ నెంబర్ అడిగిన వ్యక్తికి మతిపోయే కౌంటర్ ఇచ్చిన నాగార్జున..!!

sekhar

Breaking: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ పేరు “భగత్ సింగ్”..??

sekhar

Narappa : పంచెకట్టు లో నారప్ప సూపరో సూపరు..!!

bharani jella