NewsOrbit
Entertainment News సినిమా

Agent: చాలా పెద్ద తప్పు చేశామంటూ “ఏజెంట్” నిర్మాత సంచలన పోస్ట్..!!

Share

Agent: అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” భారీ అంచనాల మధ్య విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తీసిన ఈ సినిమా ఏమాత్రం అల్లరించలేకపోయింది. స్టోరీతో సంబంధం లేకుండా యాక్షన్ సన్నివేశాలు… హీరో ఎలివేషన్ ఉండటంతో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యెలా చేసింది. కేవలం అఖిల్ నీ హైలెట్ చేయడానికి సినిమా తీసినట్లు ఉందని చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేయడం జరిగింది. సినిమాలో కాస్తో కూస్తో… మమ్ముట్టి పాత్ర తప్ప మిగతా పాత్రలన్నీ… ఆటలో అరటిపండు అన్నట్టు ఇలా వచ్చే అలా వెళ్ళిపోయాయి. సినిమాలో హీరోయిన్ పాత్రకి కూడా పెద్దగా స్కోప్ లేదు.

Sensational post of agent producer saying that he made a big mistake

అఖిల్ లో యాక్షన్ సన్నివేశాలు భారీగా చూపించడానికి సినిమా తీసినట్లు ఉంది. “ఏజెంట్” సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో బయట భయంకరంగా ట్రోలింగ్ జరుగుతుంది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ కూడా సరైన కలెక్షన్స్ రాకపోవడంతో నిర్మాతలు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇదే సినిమాతో పాటు విడుదలైన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, పొన్నియన్ సెల్వన్ 2… పాజిటివ్ టాక్ సంపాదించడంతో ఆ ఎఫెక్ట్ “ఏజెంట్” సినిమాపై పడటం జరిగింది. ఈ పరిణామంతో ఏజెంట్ థియేటర్లు ఖాళీ అయిపోయాయి.

Sensational post of agent producer saying that he made a big mistake

ఇంతటి పరాజయం తలెత్తడంతో “ఏజెంట్” నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. “ఏజెంట్ పరాజయం పాలు కావడానికి కారణం మేమే. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్టును ప్రారంభించడంలో పొరపాటు జరిగింది. కరోనా సమయములో వచ్చిన సమస్యలను అధిగమించి చేసిన పనులు కూడా విఫలమయ్యాయి. ఇది చాలా కాస్ట్లీ తప్పు. దీనివల్ల చాలా నేర్చుకున్నాం. ఇంకొకసారి ఇటువంటి తప్పు జరగదు. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.


Share

Related posts

Vijay Devarakonda: పేరు మార్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. హ‌ర్ట్ అవుతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌!

kavya N

మొన్న సల్మాన్ ఖాన్ అన్నారు ఇప్పుడు సంజయ్ దత్ అంటున్నారు ..?

GRK

నిహారికకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

Teja