సినిమా

Mega Hero’s: అట్టర్ ఫ్లాప్ లు విషయం లో మెగా ఫ్యామిలీ ని వదలని “ఆ” సెంటిమెంట్..!!

Share

Mega Hero’s: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలకు తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషి తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుని… ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇంకా చాలా మంది లెజెండ్ హీరోల కొడుకులు ఫీల్డ్ లో ఉన్నా గానీ టాలీవుడ్ సింహాసనాన్ని అధిరోహించాడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ ని చిరంజీవి రూల్ చేయడం జరిగింది. అనంతరం చిరంజీవి తర్వాత పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ ఇంకా చాలా మంది హీరోలు రావడం తెలిసిందే.

sentiment that utter flops should not leave the mega family

అయితే ఎంత మంది హీరోలు వచ్చినా కానీ మెగా హీరోలు అనేసరికి ఎక్కువగా చిరు, పవన్, రామ్ చరణ్ ల గురించే ఫాన్స్ ఎక్కువగా చర్చించుకుంటారు. దింతో వీళ్ళ సినిమాలకు ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతాయి. ఇదిలావుంటే ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, చరణ్ కలిసి “ఆచార్య” అనే సినిమా చేయడం తెలిసిందే. ఏప్రిల్ 29వ తారీకు ఈ సినిమా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన “ఆచార్య” బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం జరిగింది.

sentiment that utter flops should not leave the mega family

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా రిలీజ్ కావటం అట్టర్ ఫ్లాప్ కావడంతో అభిమానులు ఫుల్ నిరుత్సాహం చెందడం జరిగింది. మరిముఖ్యంగా చరణ్ సినిమాలో ఉండటంతో రిజల్ట్ దారుణంగా రావడంతో అభిమానులు “ఆచార్య” పరాజయం పాలు కావడం పట్ల జీర్ణించుకోలేకపోతున్నారు. మరోపక్క వీరాభిమానులు మెగా హీరోలకు “ఆ” అక్షరం కలిసి రావడం లేదని సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ డిస్కషన్స్ చేస్తున్నారు.

sentiment that utter flops should not leave the mega family

చిరంజీవి కెరీర్ చూసుకుంటే ఆపద్బాంధవుడు, ఆరాధన, అంజి, ఆచార్య ఈ నాలుగు అట్టర్ ఫ్లాప్ సినిమాలు. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ చూసుకుంటే మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అన్నవరం, అజ్ఞాతవాసి.. ఈ మూడూ కూడా అట్టర్ ఫ్లాప్. ఇక రామ్ చరణ్ సినిమాలు చూసుకుంటే.. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆరెంజ్. మొత్తం పైన లిస్ట్ ఉన్న సినిమాలు టైటిల్స్ గమనిస్తే అన్నీ కూడా “ఆ” అనే అక్షరం కలిగిన టైటిల్స్. దీంతో మెగా హీరోలకు “ఆ” అక్షరం కలిసి రావటం లేదని.. ఇక నుండైనా భవిష్యత్తు సినిమాలకు సంబంధించి “ఆ” అక్షరంతో టైటిల్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది అని అభిమానులు సూచిస్తున్నారు.


Share

Related posts

‘అజ్ఞ్యాతవాసి’కోపంలో ఉన్న పవన్ కల్యాణ్ ఫాన్స్ కి – చాలా గ్యాప్ తరవాత మంచి చేసిన త్రివిక్రమ్ ! 

sekhar

జబర్దస్త్ లోకి రాకేష్ మాస్టర్, అతని శిష్యుడు పుల్లయ్య..! చించేశారుగా….

arun kanna

Nidhhi Agerwal Beautiful Yellow Saree Pics

Gallery Desk