Entertainment News సినిమా

రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ప్లానింగ్..?

Share

వరుస పరాజయాలు ఎదురవుతున్న సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “ధ్రువ” అనే సినిమా చేసి నిలదొక్కుకోవడం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. 2016వ సంవత్సరంలో విడుదలైన “ధ్రువ” చరణ్ నీ మళ్ళి హిట్ ట్రాక్ ఎక్కించడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ విలన్ పాత్రలో అరవింద స్వామి నటించారు. తమిళంలో తను ఒరివన్ గా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమానీ తెలుగులో “ధ్రువ” గా రీమిక్ చేయడం జరిగింది.

Sequel planning for blockbuster movie in Ram Charan's career

ఇదిలా ఉంటే ప్రస్తుతం మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవితో “గాడ్ ఫాదర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తారీఖు విడుదల కానుంది. “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఇదంతా పక్కన పెడితే మోహన్ రాజా ఇటీవల “తను ఒరివన్” రెండో భాగం కథ సిద్ధమైనట్లు తెలిపినట్లు టాక్. అయితే ఈ సినిమాని తెలుగుతోపాటు తమిళంలో కూడా తెరకెక్కించాలని అది కూడా ఒకేసారి చేయాలని డిసైడ్ అయ్యారట.

Sequel planning for blockbuster movie in Ram Charan's career

తెలుగులో “ధ్రువ 2” టైటిల్ పేరిట రామ్ చరణ్ తో చిత్రీకరించి ఆలోచనలో మోహన్ రాజా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అయితే త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత గౌతం తిననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ రెండు అయ్యాక మోహన్ రాజా దర్శకత్వంలో చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

Vishnu vishal : మాల్దీవుల్లో వాలిపోయిన మరో ప్రేమ జంట.. ఫోటోలు వైరల్..!

Teja

RRR: రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఇలా తీసుండకూడదు..తమ్మరెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్..

GRK

త్వరలో మన ముందికి సుమక్క వంటలక్కని తీసుకురాబోతుంది.. ఎందుకో తెలుసా ??

Naina