Ravi Teja: మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ అనేక అవకాశాలు అందుకుని.. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజగా స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో తిరుగులేని ఇమేజ్ సంపాదించడం జరిగింది. రెండు మూడు సంవత్సరాల క్రితం కెరియర్ పరంగా అనేక పరాజయాలు చూసిన రవితేజ… 2021లో… “క్రాక్” సినిమాతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.
ఇదిలా ఉంటే రవితేజ కొత్త సినిమా ధమాకా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గతంలో రవితేజతో చేసిన “క్రాక్” సినిమాకి సీక్వెల్ త్వరలో “క్రాక్ 2” చేయబోతున్నట్లు తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలో వచ్చాయి. ఈ మూడు కూడా ఒకదాన్ని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అన్నిటికి మించి “క్రాక్” సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.
సినిమాలు థియేటర్ లో విడుదల చేయడానికి భయపడే సమయంలో రవితేజ ధైర్యం చేసి ఈ సినిమాని విడుదల చేసే అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో రవితేజ గోపీచంద్ మళ్లీ నేను కాంబినేషన్ తిరుగులేనిది అని నిరూపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల అని ధమాకా ప్రమోషన్ కార్యక్రమాల్లో గోపీచంద్ మల్లినేని కామెంట్లు చేయటం అభిమానులలో ఆసక్తిని పెంచుతూ ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న “క్రాక్” సీక్వెల్ త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు.