Shah Rukh Khan: తమిళ సినిమా రంగంలో డైరెక్టర్ అట్లీ కుమార్ కి మంచి క్రేజ్ అన్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో హీరో విజయ్ ఇంకా చాలామంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేసాయి. అవే సినిమాలు తెలుగులో అనువాదం అయి భారీగా కూడా కలెక్షన్లు సాధించడం జరిగింది. ఇటువంటి తరుణంలో అట్లీ కుమార్ కి బాలీవుడ్ లో స్టార్ హీరో షారుక్ ఖాన్ నుండి సినిమా చేసే అవకాశం రావడంతో.. వెంటనే షారుక్ ఖాన్ తన ఫేవరెట్ హీరో కావడంతో.. అతనికి మంచి స్క్రిప్ట్ వినిపించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే మొదటి సిట్టింగ్ లోనే కథ బాగా నచ్చడంతో షారుఖ్ వెంటనే అట్లీ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగింది. గత కొంత కాలం నుండి ఈ సినిమాకి సంబందించిన డిస్కషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న షారుక్ ఖాన్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి అట్లీ కుమార్ “జవాన్” అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాలో షారుక్ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది అని అంటున్నారు.
త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ పటాన్, సాంకి అనే రెండు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా ముగింపు దశలో ఉన్నాయి. పటాన్ చిత్రీకరణ చాలా వరకు కంప్లీట్ కావడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో… షారుక్ ఒప్పుకున్న సినిమాకి “జవాన్” అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్త రావటం బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది.