NewsOrbit
Entertainment News సినిమా

Dunki: “డుంకి”తో షారుక్ ఖాన్ హ్యాట్రిక్ అందుకుంటాడు..బొమన్ ఇరానీ ఫస్ట్ రివ్యూ..!!

Share

Dunki: 2023 ఏడాది షారుక్ ఖాన్ నామదేయంగా మార్చేయవచ్చు. ఎందుకంటే వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న షారుక్ ఖాన్ 2018 వ సంవత్సరంలో “జీరో” సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు షారుక్ సినిమాలు ఏవి కూడా విడుదల కాలేదు. అంత లాంగ్ గ్యాప్ తీసుకున్న షారుక్ 2023 వ సంవత్సరం ప్రారంభంలో “పటాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా దాదాపు 1000 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో జవాన్ సినిమాతో షారుఖ్ రెండో బ్లాక్ బస్టర్ అందుకోవటం జరిగింది.

Shah Rukh Khan gets hat trick with Dunki Boman Irani first review

తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం చేసిన ఈ సినిమాలో షారుక్ నీ చాలా అద్భుతంగా విభిన్నమైన పాత్రలలో చూపించడం జరిగింది. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రకంగా రెండు భారీ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న షారుక్ డిసెంబర్ నెలలో “డుంకి” సినిమా విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. కాగా రీసెంట్ గా డుంకి సినిమాలో లండన్ లాయర్ పాత్ర చేసిన ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ “డుంకి” షారుక్ కెరియర్ లో మర్చిపోలేని సినిమాగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు.

Shah Rukh Khan gets hat trick with Dunki Boman Irani first review

ఈ ఏడాది పటాన్, జవాన్ సినిమాలతో విజయం సాధించిన షారుక్ “డుంకి” కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తాడని చెప్పుకొచ్చారు. ముంబాయి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీడియాతో తన అప్కమింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “డుంకి” షారుక్ కెరియర్లో మరో వెయ్యి కోట్లు సాధించే సినిమా అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో తాను లాయర్ పాత్రలో నటించినట్లు ఆల్రెడీ “డుంకి” ఔట్ పుట్ చూసినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఒక వైవిధ్యమైన సబ్జెక్టు కలిగినది డుంకి. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తీసిన ఈ సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. జీవితంపై అందరిని ఆలోచింపజేసేలా.. ఒక కొత్త రకం సబ్జెక్టు. కచ్చితంగా “డుంకి” బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని.. షారుక్ కెరియర్ లో మరో మైలురాయి సినిమాగా నిలిచిపోతుందని బొమన్ ఇరానీ ఫస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు ఇప్పుడు మరింతగా పెరిగిపోయాయి. “డుంకి” డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతోంది. ఈ సినిమా అన్ని అనుకున్నట్లు విజయం సాధిస్తే 2023లో షారుక్ హ్యాట్రిక్ సాధించినట్లే.


Share

Related posts

కోహ్లీ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ టగ్ ఆఫ్ వార్..??

sekhar

ఎన్టీఆర్ సాయం తీసుకుంటున్న బాలీవుడ్ హీరో.. ఆ రోజు కోసం నాగ్ ఆతృత‌!

kavya N

Nani: నాని ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!!

bharani jella