Besharam Song: బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ దీపికా పదుకొనేది తిరుగులేని కాంబినేషన్. ఇద్దరి కలయికలో ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ రికార్డ్ స్థాయి వసూలు రాబట్టాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో “పఠాన్” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
ఇందులో భాగంగా “పఠాన్” సినిమాలో దీపికా పదుకొనేకి సంబంధించి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో దీపిక అందాల డోస్ పెంచేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్న ఈ ఫోటో.. గురించి చర్చలు జరుగుతుండగానే మరోపక్క సినిమాలో “బేషరమ్” సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సాంగ్ యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఇంకా దీపికా పదుకొనే సాంగులో మరింత రెచ్చిపోయింది. బేషరమ్..లో దీపికాతో హీరో షారుక్ కూడా మరింత రెచ్చిపోయాడు. ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ నడిచింది.
ఇక సాంగ్ చివరిలో ఆఫ్ బికినీ పై షారుక్ చేయి పెట్టడం, డ్రెస్ ని పైకి ఎత్తడం… అది ప్రైవేటు పార్టీ టచ్ అయ్యేలా కనిపించడంతో … కాంట్రవర్సీ గా మారింది. బేషరమ్ సాంగ్ నీ అడ్డం పెట్టుకొని షారుక్ పై కొంతమంది ట్రోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. రణవీర్ సింగ్ ఏమైపోయాడో … అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. బేషరమ్ సాంగ్ లో దీపిక మరియు షారుక్ తెగ రెచ్చిపోయారు. “పఠాన్” సినిమాకి ఊహించని రీతిలో ఈ సాంగ్ మంచి పబ్లిసిటీ తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో సాంగులో దీపిక అందాలు కనిపిస్తూ ఉండటంతో… క్లాస్ ఆడియన్స్ నుండి విపరీతమైన నెగెటివిటీ కామెంట్లు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అన్ని సినిమాల్లో ఉన్న పాటలలో కంటే.. బేషరమ్ సాంగ్ లో ఎక్స్పోజింగ్ మరీ ఎక్కువైందని కామెంట్లు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సినిమా ఇప్పటివరకు పడలేదు. మరోపక్క దక్షిణాది సినిమాలు దూసుకుపోతున్నాయి. సౌత్ సినిమాలకు బాలీవుడ్ పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో షారుక్ “పఠాన్” పై బాలీవుడ్ వర్గాలు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ సినిమా హిందీతో పాటు తమిళ్ మరియు తెలుగు భాషల్లో కూడా… విడుదల చేస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!