ప్రముఖ మలయాళ నటి షకీలా జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందుతున్న చిత్రానికి `షకీలా: నాట్ ఎ పోర్న్ స్టార్` అనే టైటిల్‌ను పెట్టారు.ప్రముఖ శృంగార తారగా షకీలా తనదైన గుర్తింపును సంపాదించుకుంది. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రిచా చద్దా షకీలా పాత్రలో నటిస్తున్నారు.త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా గురించిన ప్రమోషనల్ కార్యక్రమంలో షకీలా మాట్లాడుతూ తన ప్రేమ వ్యవహారం, అది ఎలా ఫెయిల్ అయ్యిందనే విషయాన్ని తెలియజేశారు.“ 2007లో నేను ఛోటా ముంబై సినిమా చేస్తున్నాను. మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిసింది. సినిమా నిర్మాత మణ్యన్ పిల్లరాజును కలిసి పరిస్థితి వివరించాను. నేను చాలా సీన్స్‌లో నటించాల్సి ఉన్నా.. రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేశారు. ఆయన మంచితనం బాగా నచ్చింది. ఆయనతో ప్రేమలో పడ్డాను. ఆ విషయం ఆయనకు లెటర్ రూపంలో రాశాను. ఆయన నుండి ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో ఆయన రిజెక్ట్ చేశారని అర్థమైంది. దాంతో మరచిపోవాలనుకున్నాను“ అన్నారు షకీలా.
previous post
next post