BRO Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన “బ్రో” ఈనెల 28వ తారీకు విడుదల కాబోతోంది. కాగా నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ ట్రైలర్ లో అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఒకప్పుడు జానీ, గుడుంబా శంకర్, బాలు, గబ్బర్ సింగ్ సినిమాలలో చాలా జోష్ మీద పవన్ డైలాగులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ తరహా నటన కనపరిచే పవన్ సినిమాలు రావడం తగ్గాయి. అయితే చాలాకాలం తర్వాత ఇప్పుడు బ్రో సినిమాలో పవన్ చాలా జోష్ మీద డైలాగులు చెప్పారు. సాయి ధరమ్ తేజ్ ని ఏడిపించే రీతిలో.. పవన్ ట్రైలర్ లో కనిపించారు.
సాయిధరమ్ తేజ్ సైతం అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. మరి ముఖ్యంగా డాన్స్ పరంగా కూడా పవన్ చాలా కొత్తగా ట్రైలర్ లో కొన్ని స్టెప్పులు వేయడంతో సినిమాపై ఒకసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తమిళంలో వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్… భగవంతుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఉన్నారు. చాలాకాలం తర్వాత పవన్ సినిమాలో బ్రహ్మానందం కనిపించటంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. జూలై 22వ తారీకు సాయంత్రం విడుదలైన “బ్రో” ట్రైలర్ చాలా వరకు ఎంటర్టైన్మెంట్ తరహాలో ఉంది చివరిలో కొద్దిగా సెంటిమెంట్ సీన్స్ కనిపించాయి.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్ జోరుగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాకి డైలాగులు మరియు స్క్రీన్ త్రివిక్రమ్ అందించడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. బ్రో ట్రైలర్ అనుకున్నా రీతిగా ఉంటే అద్భుతంగా పవన్ కళ్యాణ్ నటన మరియు కామెడీ ఉండటంతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.