Shalini Pandey: షాలిని పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన `అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన షాలిని పాండే.. ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.
కానీ, ఈ సినిమా షాలిని కంటే విజయ్‌కే ఎక్కువ ప్లస్ అయిందని చెప్పాలి. ఏదేమైనా అర్జున్ రెడ్డి తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసిన షాలిని.. స్టార్ స్టేటస్‌ను దక్కించుకోలేకపోయినా నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్లో పలు చిత్రాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కెరీర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉన్న షాలినీ.. ఈ మధ్య బక్కచిక్కి హాట్ హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియా వేదికగా అదరగొట్టేస్తోంది. తాజాగా కూడా ట్రెండీ అవుట్ ఫీట్‌ను ధరించిన షాలినీ.. బ్యాక్ అందాలను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
మైండ్‌బ్లాక్ చేస్తున్న షాలిని తాజాగా ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసి కుర్రాళ్లు ఆగుతారా.. సూపర్, స్టన్నింగ్, వావ్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.